నూతన జెడ్పీలకు దిక్కెవరు? | State Election Commissioner holds video conference on local body election arrangements | Sakshi
Sakshi News home page

నూతన జెడ్పీలకు దిక్కెవరు?

Oct 10 2026 5:06 AM | Updated on Oct 10 2026 5:06 AM

State Election Commissioner holds video conference on local body election arrangements

15 కొత్త జిల్లా పరిషత్‌లకు సీఈవోను కూడా నియమించని ప్రభుత్వం 

స్థానిక ఎన్నికల్లో జెడ్పీ సీఈవోల పాత్ర అత్యంత కీలకం 

అయినా నియామకాలపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం 

సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలో 15 నూతన జిల్లా పరిషత్‌లు ఏర్పడి రెండువారాలు గడిచినా ఇప్పటికీ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల(సీఈవో)ను నియమించలేదు. జెడ్పీ మొత్తం పర్యవేక్షించే ఉన్నతాధికారులు లేకపోవడంతో కీలక పనులపై దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లతోపాటు జెడ్పీ సీఈవోలదే కీలక పాత్ర. అసలే కొత్త జిల్లా పరిషత్‌లు కావడంతో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటికి అదనంగా ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్న సీఈవోలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు. 

దీంతో రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాల అమలులో తీవ్ర కాలయాపన జరుగుతోందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో క్షేత్ర స్థాయి వరకు ముందస్తు ఎన్నికల ఏర్పాట్లను జెడ్పీ సీఈవోలే పర్యవేక్షించాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కీలక ఎన్నికల సమయంలోనూ మొత్తం 28 జిల్లాలకు సగానికి పైగా జిల్లాల్లో జెడ్పీ సీఈవోలు లేకపోవడంతో సాధారణ పాలనా వ్యవహారాలతోపాటు ఎన్నికల కార్యక్రమాల అమలులో ఇబ్బందులు తలెత్తున్నట్టు చెబుతున్నాయి.  

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భేటీలోనూ చర్చ 
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై గురువారం అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కొత్త జిల్లాల్లో జెడ్పీ సీఈవోలను నియమించకపోవడంపై చర్చకు వచి్చంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎలక్షన్‌ నోటిఫికేషన్‌కు ముందే 15 జిల్లాల జెడ్పీ సీఈవోలను నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పునేఠ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement