నర్సాపూర్‌–యశ్వంత్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు  | Special trains between Narsapur and Yeswantpur | Sakshi
Sakshi News home page

నర్సాపూర్‌–యశ్వంత్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు 

May 11 2023 4:47 AM | Updated on May 11 2023 4:47 AM

Special trains between Narsapur and Yeswantpur - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల డిమాండ్‌ మేరకు నర్సాపూర్‌–యశ్వంత్‌పూర్‌ మధ్య 6 వారంతపు సర్విసులు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ప్రకటించారు. నర్సాపూర్‌–యశ్వంత్‌పూర్‌ (07687) ఈ నెల 14, 21, 28 తేదీలలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి 7.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

అక్కడ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07688) ఈ నెల 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ బయలుదేరి ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement