అసెంబ్లీకి ఉన్న హక్కులపై చర్చించాలని భావిస్తున్నాం: శ్రీకాంత్‌రెడ్డి

Speaker Tammineni Sitaram Conducted Review Over Assembly Meetings - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలే అత్యంత ప్రాధాన్యంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజా సమ‍స్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో టీడీపీలా కాకుండా మేము ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నాం. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేరు తెచ్చి సమావేశాల నుంచి వెళ్లిపోయారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి హాజరవ్వాలి.

అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండి రాజకీయం చెయ్యాలని అనుకుంటున్నారు. టీడీపీ బయట మాట్లాడేవి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి. వివేకా హత్యపై తప్పుడు రాతలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దానిపై కూడా అసెంబ్లీ లో మేము చర్చించేందుకు మేము సిద్ధం. అసెంబ్లీ అధికారాలపై సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన లేఖ రాశారు. దీనిపై బీఏసీలో స్పీకర్‌ అనుమతితో చర్చించాలని కోరతాం. అసెంబ్లీకి ఉన్న హక్కులపై కూడా చర్చించాలని భావిస్తున్నట్లు చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. 

చదవండి: (సైకిల్ యాత్రలో అపశృతి.. కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యే)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top