మహిళల పట్ల అశోక్‌గజపతిరాజు వివక్ష అనాగరికం: వాసిరెడ్డి పద్మ

Sanchaita Complaint To Womens Commission Over Injustice To Her - Sakshi

సాక్షి విశాఖపట్నం: సంచయితపై అశోక్‌ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపట్ల మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల అశోక్‌ గజపతిరాజు వివక్ష అనాగరికమని అన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మాన్సాస్‌ ట్రస్ట్ మాజీ చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు బుధవారం మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. విశాఖలో కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఫిర్యాదు చేశారు.

ముఖ్యంగా తన నియామకంతో పాటు వారసత్వం అంశాన్ని కించపరిచే రీతిలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేశారని సంచయిత ఆరోపించారు. సంచయిత ఫిర్యాదుపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. అశోక్ గజపతిరాజు రాచరికపు వ్యవస్థలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాన్సాస్ ట్రస్ట్ బైలా పునః సమీక్షించాలని అన్నారు. సంచయిత విషయంలో అశోక్ చర్చకు సిద్దమా? అని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు.

చదవండి: 
‘విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరు’

అనంతపురం జిల్లాలో ఉద్యాన విప్లవం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top