సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జేఎస్ డబ్ల్యు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘మీ ప్రభుత్వంలో వేగంగా వచ్చిన అనుమతుల వల్లే స్టీల్‌ప్లాంట్ సాధ్యమైంది. త్వరలోనే జేఎస్‌డబ్యూ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తి చేస్తాం. అక్కడ యువతకు మంచి భవిష్యత్ ఉంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు.
Thank you for your kind wishes, Shri @ysjagan Garu 🙏🏼
From the early approvals under your government to this commencement today, the journey reflects sustained effort — and we’re committed to completing it swiftly for the region’s youth and families.— Sajjan Jindal (@sajjanjindal) July 3, 2026
కాగా, కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సజ్జన్ జిందాల్, జేఎస్ డబ్ల్యు స్టీల్ బృందానికి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ఫోటోతో ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. రాయలసీమ పారిశ్రామిక అభివృద్దికి ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయి. యువతకు ఉపాధి అవకాశాలు లభించటం ద్వారా ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుతుందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Heartiest congratulations to Shri @sajjanjindal Garu and the entire @jswsteel team on the restart of the steel plant project in Kadapa. This is a significant milestone for the industrial development of Rayalaseema and a moment of hope for the youth and families aspiring for… pic.twitter.com/pI0CJVhV7e
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 3, 2026
‘‘ఎన్నో సంవత్సరాల కృషి, ప్లానింగ్ అనే పునాదుల మీద ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితమవుతాయి. మా ప్రభుత్వ హయాంలో జేఎస్ డబ్ల్యూ ప్రాజెక్టు రూపుదిద్దుకోవటానికి కీలకమైన పునాదులు వేశాం. పర్యావరణ అనుమతులు పొందేందుకు సహకరించాం. నీటి కేటాయింపులూ మా హయాంలోనే చేశాం. భూ కేటాయింపు, రోడ్ల అనుసంధానం, ఇతరత్రా మౌళిక సదుపాయాల కోసం అవసరమైన భూమిని కూడా అందించాం. అలాగే ప్రాజెక్టు ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టాం. ఆ కారణంగానే ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు కదిలాయి. కానీ దురదృష్టవశాత్తూ గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
..ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టు ఆలస్యమయింది. ఇప్పుడైనా పనులు తిరిగి ప్రారంభం కావటం సంతోషకరం. కడప ప్రజలు చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇక ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. కడప నా సొంత జిల్లా కావటంతో ఈ ప్రాజెక్టుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా అక్కడి యువతకు మంచి భవిష్యత్తు లభించాలని నేను కోరుకుంటున్నాను’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.


