
సాక్షి, తిరుమల: దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని.. ఆదర్శవంతమైన రాష్ట్రంగా కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలివ్వగా.. అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విష శక్తుల కుట్రలను ఎదుర్కొనే శక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని దేవదేవుడ్ని ప్రారి్థంచినట్లు చెప్పారు. సీఎం జగన్‌కు ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఎప్పుడైనా ఏర్పాటు కావచ్చన్నారు.
చదవండి: (ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: కె విజయానంద్)