ప్రజలకు నాణ్యమైన‌ విద్యుత్ అందించడమే లక్ష్యం: కె విజయానంద్‌

Aim is to provide quality electricity to people: K Vijayanand - Sakshi

సాక్షి, విజయవాడ: దేశాభివృద్ధికి వెన్నెముక విద్యుత్‌ రంగం అని ఇంధనశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె. విజయానంద్‌ అన్నారు. అలాంటి కీలకమైన విద్యుత్‌ శాఖలో పనిచేయడం మనందరి అదృష్టమని చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్‌ శాఖ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. 'విద్యుత్ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలి. విద్యుత్ రంగం అభివృద్ది దిశగా పయనిస్తోంది. 11 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ద్యానికి ఏపీ విద్యుత్ శాఖ పెరిగింది. కృష్ణపట్నం ప్రాజెక్ట్‌ని ఇప్పటికే జాతికి అంకితం చేశాం. విజయవాడలో 800 మెగావాట్ల ధర్మల్ ప్లాంట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తాం. ప్రజలకి నాణ్యమైన‌ విద్యుత్ అందించడమే లక్ష్యం. వేసవిలో విద్యుత్ కోతలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకి 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం' అని విజయానంద్‌ చెప్పారు.

చదవండి: (ఈ పిట్ట రుచికి నాటుకోళ్లు, పొట్టేలు కూడా సాటిరావు)

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top