నేడు విశాఖలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం | RTC JAC is going to hold a crucial meeting on july 14 | Sakshi
Sakshi News home page

నేడు విశాఖలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం

Jul 14 2026 4:40 AM | Updated on Jul 14 2026 4:40 AM

RTC JAC is going to hold a crucial meeting on july 14

డాబాగార్డెన్స్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల న్యా­యమైన డిమాండ్ల సాధనకు చేపట్టాల్సిన తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ఏపీ­ఎస్‌­ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం మంగళవారం విశాఖలో జరగనుంది. మద్దిలపాలెంలోని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఉద్యమ కా­ర్యాచరణపై చర్చించనున్నారు.

ఈ నెల 14 నుంచి ప్రజాప్రతినిధులను కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించే కార్యక్రమం, ప్రభుత్వానికి డిమాండ్లను తెలియజేసే తదుపరి చర్యలపై చర్చించనున్నట్లు జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు సోమవారం తెలిపారు. సమా­వేశం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న 30 ప్రధాన సమస్యలు, డిమాండ్లతో రూపొందించిన సమగ్ర నివేదిక (బుక్‌లెట్‌)ను ఆవిష్కరిస్తారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement