విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల ముఠా హల్‌చల్‌.. రైల్వే పోలీసుల కాల్పులు | Railway Police Alert Visakha Express At Palnadu | Sakshi
Sakshi News home page

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల ముఠా హల్‌చల్‌.. రైల్వే పోలీసుల కాల్పులు

Jun 29 2025 6:58 AM | Updated on Jun 29 2025 11:55 AM

Railway Police Alert Visakha Express At Palnadu

సాక్షి, పల్ల్నాడు: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దొంగతనాలకు పాల్పడిన వారు బీహార్‌, మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్‌లుగా గుర్తించారు.

వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది. ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో, దొంగల ముఠా పారిపోయింది. అయితే, పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్‌లు దొంగతనానికి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, వారం రోజుల వ్యవధిల ఇప్పటికే రైళ్లలో రెండు సార్లు దొంగతనం జరిగింది. తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement