బీ-3 బ్రాండ్లు​ అంటే భువనేశ్వరి, బ్రాహ్మాణి, బాబు: పోతుల సునీత

Pothula Sunitha Serious Comments On TDP Nara Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైరయ్యారు. ఆయన పేరు నారా చంద్రబాబు కాదు.. సారా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఫ్యామిలీనే తాగుబోతు కుటుంబం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పోతుల సునీత ఆదివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నారా చంద్రబాబు కాదు.. సారా చంద్రబాబు నాయుడు. పైకి పాల ‍వ్యాపారం.. తెర వెనుక సారా పరిశ్రమ. భువనేశ్వరి, బ్రాహ్మణికి మద్యం ద్వారా రోజూ రూ.కోటి ఆదాయం అందుతోంది. బీ-3 బ్రాండ్లు​ అంటే భువనేశ్వరి, బ్రాహ్మాణి, బాబు అని అర్థం. మగువ, మందు లేనిదే లోకేష్‌కు నిద్రపట్టదు. టోటల్‌గా బాబు కుటుంబమే తాగుబోతు ఫ్యామిలీ. చంద్రబాబు హయంలోనే డిస్టిలరీలు, బ్రూవరీలన్నింటికీ లైసెన్స్‌లు ఇచ్చారు. 240 మద్యం బ్రాండ్‌లను చంద్రబాబే తీసుకొచ్చారు. ప్రజలను తాగుబోతులుగా మార్చి చంద్రబాబు వేల కోట్లు ఆర్జించారు. చుక్క లేకపోతే చంద్రబాబు, లోకేష్‌ ఒక్కమాట కూడా మాట్లాడలేరు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. చంద్రబాబు పాలనంతా దాచుకోవడం, పంచుకోవడం, తినడమే. 

పులివెందుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేస్తున్నారు. మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. అవినీతి లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పచ్చమీడియా తప్పుడు రాతలు మానుకోవాలి’ అని సూచించారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు చెక్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌ సేవలను వాడుకుంటాము: సోము వీర్రాజు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top