Somu Veerraju Interesting political Comments On Junior NTR - Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు చెక్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌ సేవలను వాడుకుంటాము: సోము వీర్రాజు

Sep 4 2022 2:30 PM | Updated on Sep 4 2022 3:04 PM

Somu Veerraju Interesting political Comments On Junior NTR - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణలోని మునుగోడు పర్యటనలో భాగంగా నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరి మధ్య రాజకీయంగా మంతనాలు జరిగినట్టు లీక్‌లు బయటకు రావడంతో పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమువీర్రాజు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జూ. ఎన్టీఆర్‌ సేవలను ఉపయోగించుకుంటాము. చంద్రబాబుపై మా వైఖరిలో ఎలాంటి మార్పులేదు. జూ.ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ఆయనుకు ప్రజాదరణ ఎక్కడుంటే ఆయన సేవలు అక్కడే ఉపయోగించుకుంటాము. ఫ్యామిలీ పార్టీలకు దూరమని మా అధిష్ఠానమే చెప్పింది అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement