Ponguru Priya Tweet On Ex Minister Narayana, Says Im Ready For Narco Test - Sakshi
Sakshi News home page

నార్కో టెస్ట్‌కు నేను రెడీ : పొంగూరు ప్రియ

Aug 1 2023 8:40 AM | Updated on Aug 1 2023 4:32 PM

Ponguru Priya Tweet On Ex Minister Narayana - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తనకు అనారోగ్యంగా ఉన్నా.. ఓపిక చేసుకొని రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఇప్పటి వరకు పోలీసులు తనకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వలేదని, ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు ప్రియ సోమ­వారం ట్విట్టర్‌లో ప్రశ్నించారు. తాను జనసేన పార్టీకి, పవన్‌కళ్యాణ్‌కు వీరాభిమానినని తెలిపారు.

తనకు సమస్య వస్తే పవన్‌ పట్టించుకోలేదని, ఆయన సీఎం అయితే నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాను చెప్పిన వాటిల్లో నిజాలు నిగ్గుతేల్చేందుకు నార్కో టెస్ట్‌కు సిద్ధమని, తనది తప్పని తేలితే నారాయణ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరతానని చెప్పారు. నారాయణకు కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

నారాయణ వైద్యశాలలో సుప్రసిద్ధులైన మహిళా డాక్టర్లు చాలా మంది నారాయణ లైంగిక వేధింపులు తాళలేక అక్కడ ఉద్యోగాలు మానేసి వెళ్లిన వాస్తవాలు ఆధారాలతో సహా తన వద్ద ఉన్నాయన్నారు. సాటి మహిళల పేర్లు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే వారి పేర్లను చెప్పడంలేదని తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement