ఫయాజ్‌బాషాను అడ్డుకుంటున్నఎస్‌ఐ దయాకర్‌రెడ్డి
తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని అడ్డుకున్న పోలీసులు
తాడిపత్రి టౌన్: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న తాడిపత్రి పోలీసులు పౌరుల ప్రాథమిక హక్కులను కూడా హరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఫయాజ్‌బాషా తాడిపత్రిలోని 4 వార్డులో ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ప్రచారం పేరుతో అదే వార్డులోకి వచ్చారు. వెంటనే ఎస్‌ఐ దయాకర్‌రెడ్డి అక్కడికి వచ్చి ‘ఇక్కడ టీడీపీ వాళ్లు ఉన్నారు.నువ్వు ప్రచారం చేయొద్దు..ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని ఫయాజ్ బాషాను బెదిరించారు.
ఎన్నికల ప్రచారం చేసుకునే హక్కు తమకు లేదా అంటూ పోలీసులను ఫయాజ్‌భాషా ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే తాము ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నా పట్టించుకోకుండా తమనే ఇళ్లకు వెళ్లమని చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. అయినా ఎస్‌ఐ పట్టించుకోకుండా లా అండర్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ ఫయాజ్‌బాషాతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బలవంతంగా వెనక్కి తిప్పి పంపారు.


