– కాలిపు శ్రీదేవి, పొందూరు 3 ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి, శ్రీకాకుళం జిల్లా , – పప్పల రాజ్యలక్షి్మ, బాణాం ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి, శ్రీకాకుళం జిల్లా, – కూన శోభారాణి, కోటిపల్లి ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, శ్రీకాకుళం జిల్లా
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో ‘పరిషత్’ ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను నవ్వులపాలు చేస్తున్నాయి. అభ్యర్థులు అసలు నామినేషన్లు వేసే పరిస్థితే లేకుండా అధికార పార్టీ అల్లరి మూకల అడ్డగింతలతోపాటు ఫేక్ నామినేషన్ల డ్రామా ఒక ఎత్తయితే... వీటిని దాటుకుని నామినేషన్లు వేసిన వారిని ప్రలోభ పెట్టడం లేదా బెదిరించడం మరో ఎత్తు అన్నట్లుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఏకగ్రీవాల కోసం పలుచోట్ల స్వయంగా పోలీసులే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని తీవ్ర ఒత్తిళ్లు తేవడం ఈ ఎన్నికల ప్రక్రియను ఎంత అవహేళన చేస్తున్నారో చెప్పేందుకు నిదర్శనం.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగా.. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 659 మండలాలకు జెడ్పీటీసీ ఎన్నికలు కొనసాగుతుండగా.. రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఏకగ్రీవాల సమాచారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చేరలేదు. జిల్లాల నుంచి అధికారులకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు 79 చోట్ల అధికార కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు పేర్కొంటున్నారు. అధికారుల ప్రాథమిక సమాచారం మేరకు.. పల్నాడు జిల్లాలో 18, వైఎస్సార్ కడప జిల్లాలో 23, నంద్యాల జిల్లాలో 8, నెల్లూరు జిల్లాలో 5, బాపట్లలో ఒకటి, ఏలూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలో రెండు, మార్కాపురం జిల్లాలో ఏడు, తిరుపతి జిల్లాలో నాలుగు, చిత్తూరులో మూడు, అన్నమయ్య జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో మూడు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులకు ప్రాథమిక సమాచారం పంపారు. మరోవైపు ఎంపీటీసీ ఎన్నికల వివరాలు ఆయా మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చేరాల్సి ఉంది.
వీటిని ఏకగ్రీవాలంటారా..?
⇒ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో అన్నిచోట్లా అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల చుట్టూ వందలాదిగా అధికార పార్టీ అల్లరిమూకలు తిష్ట వేశాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఒక్కరిని కూడా నామినేషన్ వేయనీయకుండా చేయడంతో పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మన్సిపాలిటీలు ఏకగ్రీవం కాగా.. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. నామినేషన్లు వేయకుండా పచ్చముఠాలు అడ్డుకోవడంతో మొత్తం ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి.
⇒ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలకు ఐదుచోట్ల ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించగా.. అదంతా బూటకమని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. 21 చోట్లా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగా స్క్రూటినీలో అందరి నామినేషన్లు ఆమోదించినట్లు అధికారులు ప్రకటించారు. ఉపసంహరణ సమయంలో అభ్యర్థులు ఎవరూ విత్ డ్రా చేసుకోలేదు. కానీ మంగళవారం సాయంత్రం స్థానిక ఎన్నికల అధికారి ప్రకటించిన తుది జాబితాలో మాత్రం పొందూరు 3, రాపాక 1, కోటిపల్లి, బాణాం, నందివాడ ఎంపీటీసీలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించడంతో ఆయా చోట్ల ఆందోళనకు దిగారు. దీంతో ఆ ఐదు స్థానాల అభ్యర్థులను రప్పించి మంగళవారం రాత్రి పొద్దుపోయాక అధికారులు తిరిగి ఆయా నామినేషన్ల ఉపసంహరణను పరిశీలించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
⇒ పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధికార పార్టీ అల్లరిమూకలు ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో మొత్తం 18 జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది.
⇒ దౌర్జన్యాలతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కుమార్తెను ఏలూరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా చేసుకోవాలని పెదవేగి జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీలో నిలబెట్టారు. ఆ జెడ్పీటీసీ స్థానానికి 8 నామినేషన్లు దాఖలైనప్పటికీ బెదిరించి ప్రలోభాలకు గురిచేసి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడంతో ఆ స్థానం ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు.
⇒ మార్కాపురం జిల్లా కొమరోలు జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను పరిశీలన సమయంలో అధికారులు తిరస్కరించడంతో ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు.
⇒ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైన వాటిలో నెల్లూరు జిల్లా చిల్లకూరు జెడ్పీటీసీ ఉంది. ఆ స్థానాన్ని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా ప్రతిపక్షం కనీసం అభ్యరి్థని కూడా పెట్టడానికి వీలు లేకుండా అధికార పార్టీ గూండాలు స్థానిక ఎస్టీలను ఊరు బయటకు పంపేశారు. ఖాకీల అండతో కూటమి పార్టీల దుర్మార్గాలకు ఇది మచ్చు తునక. నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన ఇందుకూరుపేట, కొడవలూరు, గుచి్చ, సీతారాంపురంలోనూ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు.
⇒ వైఎస్సార్ కడప జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా దౌర్జనాలు, బెదిరింపులతో 23 చోట్ల కూటమి పార్టీలు ఏకగ్రీవం చేసుకున్నాయి. అందులో 6 చోట్ల నామినేషన్లు వేయడానికి వచి్చన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతుల్లో నుంచి పత్రాలను టీడీపీ నేతలు దౌర్జన్యంగా గుంజుకున్నారు. 12 చోట్ల నామినేషన్లు వేసినా పరిశీలన సమయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి చెల్లని వాటిగా ప్రకటించేలా చేశారు. మరో ఐదుచోట్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులను బెదిరింపులతోపాటు ప్రలోభాలకు గురి చేసి ఉపసంహరింపజేశారు.
⇒ అద్దంకి నియోజకవర్గం కలవకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పసుభి జేమ్స్‌ను టీడీపీ రౌడీలు కిడ్నాప్ చేశారు. దీనికి పోలీసులు సైతం సహకరించారు.
దొంగ నాటకాలు
మాతో ఎన్నికల్లో పోటీ పడలేక దొంగ సంతకాలతో నామినేషన్ పత్రాలను వెనక్కి తీసేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చూడలేదు. దొంగచాటుగా ఏకగ్రీవం చేసుకోవడం సిగ్గు చేటు. దీన్ని వదలం.
– కాలిపు శ్రీదేవి, పొందూరు 3 ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి, శ్రీకాకుళం జిల్లా
మాతో గెలవలేక దొంగ దెబ్బ తీశారు
నామినేషన్ వేసిన తర్వాత ఆర్వో కార్యాలయానికే వెళ్లలేదు. నామినేషన్ ఉపసంహరణ చేసుకోలేదు. ప్రజల్లో ప్రచారంలో బిజీగా ఉన్నాం. అయినా మేము నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నామని ఆర్వో ప్రకటించడం దారుణం. కూటమి నాయకులకు ఆర్వో అమ్ముడుపోయారు. మాతో గెలవలేక దొంగ దెబ్బ తీశారు. కోర్టుకెళ్లి తేల్చుకుంటాం. – పప్పల రాజ్యలక్ష్మి, బాణాం ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి, శ్రీకాకుళం జిల్లా
మహిళలతో పోటీ పడలేక
కూటమి నాయకులు మా మహిళలతో పోటీలో గెలవలేక ఫోర్జరీ సంతకాలు చేసి, నామినేషన్ ఉçపసంహరణ చేసుకున్నట్టుగా కుట్ర చేశారు. మేము నామినేషన్లు వేసిన తర్వాత మళ్లీ ఆర్వో కార్యాలయానికే వెళ్లలేదు. ఆర్వో ముఖం చూడలేదు. అయినా విత్ డ్రా చేసుకున్నట్లు చెబుతున్నారు. సీసీ ఫుటేజీ తీసి, ఫోర్జరీ సంతకాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– కూన శోభారాణి, కోటిపల్లి ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, శ్రీకాకుళం జిల్లా
అన్యాయంపై కోర్టును ఆశ్రయించాం
మా నామినేషన్లను ఉపసంహరించుకోకుండానే మేము విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ అన్యాయంపై కోర్టును ఆశ్రయించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాల్సిన అధికారులే అడ్డదారులు తొక్కితే సామాన్యులు పరిస్థితేంటి? దీనిపై ఎంతకైనా పోరాటం చేస్తాం. దొంగ రాజకీయాలు చేశారు.
– లింగాల అరుణకుమారి, నందివాడ ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి , శ్రీకాకుళం జిల్లా
దారుణానికి ఒడిగట్టారు
ఓడిపోతారన్న భయంతో కూటమి నాయకులు తప్పుదారిలో వెళ్లారు. వారితో ఆర్వో చేతులు కలిపి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అన్యాయంపై పోరాటానికి సిద్ధం. – ఎచ్చెర్ల పద్మావతి, రాపాక 1 ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, శ్రీకాకుళం జిల్లా
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు
ప్రజాక్షేత్రంలో కూటమి అభ్యర్థులు గెలవలేక పోర్జరీ సంతకాలు చేసి, మా నామినేషన్లను విత్‌డ్రా చేశారు. నామినేషన్ ఉపసంహరించారంటూ ఆర్వో ప్రకటించడం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసినట్లే. ఐదుగురు మహిళా ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్వో దగ్గరికి గానీ, కార్యాలయానికి కానీ రాకుండా వారి నామినేషన్లు ఎలా ఉపసంహరిస్తారు? ఎమ్మెల్యే కూన రవికుమార్‌కి ఆర్వో అమ్ముడుపోయాడు. ఫోర్జరీ సంతకాలపై ఎన్నికల కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీని తీసి దోషులను కఠినంగా శిక్షించేలా న్యాయ పోరాటం చేస్తాం. సుప్రీం కోర్టు వరకు వెళ్తాం.
– చింతాడ రవికుమార్, వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త, శ్రీకాకుళం జిల్లా


