పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి: ప్రధాని మోదీ | PM Modi To Attend Sathya Sai Centenary Celebrations In Puttaparthi Updates | Sakshi
Sakshi News home page

పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి: ప్రధాని మోదీ

Nov 19 2025 10:33 AM | Updated on Nov 19 2025 2:30 PM

PM Modi To Attend Sathya Sai Centenary Celebrations In Puttaparthi Updates

సాక్షి, శ్రీసత్యసాయి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో జరిగే సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో మోదీ.. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం, నివాళి అర్పించారు. అంతకుముందు.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ స్వాగతం పలికారు. రోడ్డు మార్గం ద్వారా మోదీ ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు.

బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, నాలుగు తపాలా బిళ్లను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతర ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. బాబా బోధనలు దేశమంతా ప్రభావం చూపాయి. బాబా జీవితం.. వసుధైక కుటుంబం అన్న భావనతో సాగింది. సత్యసాయి బాబా ఎంతో మందికి సేవ చేశారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి. బాబా బోధనలు చాలా మంది జీవితాలను మార్చేశాయి. సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉంది. ఎన్నో కోట్ల మందికి బాబా మార్గదర్శనం చేశారు.

భక్తి, జ్ఞానం, కర్మ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయి. కోట్లాది మంది బాబా భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి భక్తులను ఎంతో ప్రేమతో చూసుకునేవారు. గతంలో రాయలసీమలో తాగునీటి కష్టాలు ఉండేవి. సత్యసాయి ట్రస్ట్‌ ద్వారా పేదలకు సురక్షిత నీరు అందించారు. ప్రేమ, సేవకు సత్యసాయి ప్రతిరూపంగా నిలిచారు. సేవే మరమావధిగా బాబా భావించారు. మానవసేవే.. మాధవసేవ అని బాబా భావించారు అని చెప్పుకొచ్చారు. 

ఇక, కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడుకు వెళ్లనున్నారు. కోయంబత్తూరులో మధ్యాహ్నం 1.30 గంటలకు దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభిస్తారు. 


 

 

Advertisement
 
Advertisement
Advertisement