యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది: మోదీ | PM Modi And Others Parcipated Yoga Celebrations At Visakhapatnam, More Details Inside | Sakshi
Sakshi News home page

యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది: మోదీ

Jun 21 2025 7:18 AM | Updated on Jun 21 2025 12:41 PM

PM Modi And Others Parcipated Yoga Celebrations AT Visaka

సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు పలువురు యోగాసనాలు వేశారు. యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌ నినాదంతో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు.  ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవన శైలిని మార్చింది. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు. వ్యక్తిగత క్రమశిక్షణకు యోగా అద్భుతమైన సాధనం.

యోగాతో వ్యతిగత క్రమశిక్షణ అలవడుతుంది. ప్రపంచంతో మన అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదే. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. ప్రజల భాగస్వామ్యానికి ఇదొక స్పూర్తిగా నిలిచింది. యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ అభివృద్ధి చేస్తోంది. యోగా గురించి మన్‌ కీ బాత్‌లో కూడా చర్చించాను’ అని చెప్పుకొచ్చారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement