విజయవాడ: 76.74 ఎకరాల మంగళంపేట భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీఎఫ్(Principal Chief Conservator of Forests) చలపతిరావు స్పందించారు. పవన్ ఆరోపణలకు విరుద్ధంగా ఆయన ప్రకటన చేశారు. అక్కడ 77 ఎకరాలు ఎన్‌క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులకు ఉందని ఆయన వెల్లడించారు. 76.74 ఎకరాల భూమి తమదే అని ఎంపీ మిథున్ రెడ్డి వాదనతో చలపతిరావు ఏకీభవించారు.
కాగా, 76.74 ఎకరాలు పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. దీనిపై ఎంపీ మిథున్‌రెడ్డి రికార్డులను సైతం వెల్లడించారు. ఎంపీ మిథున్‌రెడ్డి వాదనతో చలపతిరావు ఏకీభవించడంతో పవన్ కళ్యాణ్ చేసినవి ఆరోపణలేని తేటతెల్లమైంది.
పెద్దిరెడ్డి భూముల ఫెన్సింగ్ బయట ఉండటంతో వాటిని ఆయన కుటుంబానికి ఆపాదించి తప్పుడు ప్రచారం చేశారు. అయితే అటవీ భూమి పక్కన పెద్దిరెడ్డి భూములు ఉన్నాయని పీసీసీఎఫ్ స్పష్టం చేశారు. అందుకే పెద్దిరెడ్డి కుటుంబంపై కేసు పెట్టామన్నారాయన.
ఇప్పటికే ఈ భూములపై సర్వే చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించలేదని చంద్రబాబు ప్రభుత్వం సైతం నిర్దారించింది. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కూడా ఈ భూములపై విచారణ జరిపారు. అప్పుడు కూడా ఆక్రమించలేదని విచారణలో నిర్ధారణయ్యింది.
అయితే పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షకట్టి నోటీసులు జారీ చేశారు. నోటీసులపై పెద్దిరెడ్డి కుటుంబం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్న భూములపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. దానికి ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజంగానే కబ్జా చేస్తే ఇన్నాళ్లూ చర్యలు తీసుకుంటారా? అని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి పవన్ నుంచి సమాధానం రాలేదు. మరొకవైపు అక్కడ 77 ఎకరాలు ఎన్ క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులకు ఉందని పీసీసీఎఫ్ వెల్లడించడంతో పవన్ హెలికాఫ్టర్ ఎపిసోడ్ బెడిసికొట్టినట్లయ్యింది.


