
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని జనసేన పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. బాబు కేబినెట్‌లో ఒక డిప్యూటీ సీఎం, అయిదుగురు మంత్రి పదవులను కోరుతోంది జనసేన. పవన్‌తో పాటు మరో అయిదుగురికి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
మంత్రుల రేసులో నాదేండ్ల మనోహార్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్దా ప్రసాద్, బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. చంద్రబాబు పవన్ మద్య ఇప్పటికే చర్చలు జరిగాయి. అయితే బీజేపీ పెద్దల డెరెక్షన్ తర్వాత కేబినెట్ బెర్తులపై స్పష్టత రానుంది. ఈనెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.