ఏపీలో 16కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు | Omicron Tally Increases To 16 In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఒమిక్రాన్‌ అప్‌డేట్‌: ఏపీలో 16కి చేరిన కేసులు.. ఐసోలేషన్‌లో చికిత్స

Dec 29 2021 3:43 PM | Updated on Dec 29 2021 3:43 PM

Omicron Tally Increases To 16 In Andhra Pradesh - Sakshi

ఒమిక్రాన్‌ కేసుల విజృంభణ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. తాజాగా ఏపీలో విదేశీ ప్రయాణికుల 10 కేసులు..

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో పది ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటిదాకా ఈ కరోనా వేరియెంట్‌ బారినపడ్డ వారి సంఖ్య 16కి చేరింది.

ఇటీవల విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  తూర్పుగోదావరి లో ముగ్గురు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు లో ఒక్కొక్కరు వేరియెంట్‌ బారినపడ్డారు. 

ఇక అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో ఇద్దరి చొప్పున ఒమిక్రాన్ బారినపడ్డారు. ఈ పది మందిని ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

Advertisement
 
Advertisement
Advertisement