ఏపీ: భారీగా పెరుగుతున్న కరోనా డిశ్చార్జ్‌లు | Number of Covid Recovery Rate Increasing In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ: నెల రోజుల్లో 1.39 లక్షల మంది రికవరీ

Aug 12 2020 1:37 PM | Updated on Aug 12 2020 1:47 PM

Number of Covid Recovery Rate Increasing In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత నెల రోజుల్లో 1.39 లక్షల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రాష్ట్రంలో నమోదైన 2.44 లక్షల పాజిటివ్‌ కేసుల్లో ఇప్పటి వరకు 1.54 లక్షల మంది రికవరీ అయినట్లు వైద్యారోగ్యశాఖ బుధవారం ట్విటర్‌లో తెలిపింది. ప్రస్తుతం 87,597 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. (63.28 % రికవరీ )

తాజా గణాంకాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లో రికవరీ రేటు 63.28 శాతంగా నమోదయింది. మొన్నటివరకూ ఇది 50 నుంచి 55 శాతం మధ్య ఉండేది. మంగళవారం ఒక్కరోజే 9,113 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దూకుడు కొనసాగిస్తోంది. మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో 25,92,619 టెస్టులు చేశారు. మిలియన్‌ జనాభాకు 48,551 టెస్టులు చేస్తున్నారు. దేశంలో ఇదే అత్యధికమని ఐసీఎంఆర్‌ గణాంకాల్లో తేలింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement