ఏయ్‌.. నేను ఎవర్నో తెలుసా? | Nandigama Jana Sena Leader Threat Villagers Over Illicit Relationship, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏయ్‌.. నేను ఎవర్నో తెలుసా?,

Jun 4 2025 8:07 AM | Updated on Jun 4 2025 8:38 AM

Nandigama Jana Sena Leader Threat Villagers Over Illicit Relationship

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆమె వితంతువు. మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. అయితే ఆ ప్రియుడి సాయంతోనే తన అత్తమామలను హతమార్చేెందుకు ప్రయత్నించి పట్టుబడి పోయింది. ఆ ప్రియుడేమో ‘‘ఏయ్‌.. నేను ఎవర్నో తెలుసా?. నా బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?.. జనసేన లీడర్‌ని, ఇక్కడి ఎమ్మెల్యే పీఏని’’ అంటూ ఊరి జనంపైనే బెదిరింపులకు దిగాడు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

మమత అనే మహిళ భర్త ఐదేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అత్తమామల దగ్గరే ఉంటూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా కర్రి హనుమంతరావు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి పెద్దలు ఆమెను మందలించారు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ఏకంగా వాళ్ల అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో.. 

ప్రియుడు హనుమంతరావుతో కలిసి అత్తమామలను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. గత రాత్రి మరో వ్యక్తితో కలిసి వచ్చిన హనుమంతరావు.. కొబ్బరి కాయలు కొట్టే కత్తితో వెంకటేశ్వర్లు, మంగమ్మలపై దాడి చేయబోయాడు. దీంతో వాళ్లు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో షాక్‌ తిన్న హనుమంతరావు పారిపోయే యత్నం చేయగా.. గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. 

ఆ సమయంలో తాను.. జనసేన లీడర్‌నని, నందిగామ ఎమ్మెల్యే పీఏ వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు.. హనుమంతరావు ఫోన్‌లోని ఫొటోలు, ఇతర వివరాల ఆధారంగా పోలీసులు జనసేన నేతగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement