నేడు, రేపు తేలికపాటి వర్షాలు | Moderate rain for two days in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేడు, రేపు తేలికపాటి వర్షాలు

Oct 24 2021 5:19 AM | Updated on Oct 24 2021 5:19 AM

Moderate rain for two days in Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. ఈ నెల 26న ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ  రాష్ట్రం వైపు వస్తోంది. దీంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా  మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతిలో 106.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

Advertisement
 
Advertisement
Advertisement