breaking news
Weather stations
-
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. ఈ నెల 26న ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ రాష్ట్రం వైపు వస్తోంది. దీంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతిలో 106.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
పక్కాగా చినుకు లెక్క!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇకపై వర్షపాతం నమోదు పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం తెలుసుకునేలా 120 చోట్ల వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు వర్షం కురిస్తే.. వర్షం వెలిశాక ఏ ప్రాంతంలో ఎంత వర్షంకురిసిందో తెలుస్తోంది. వర్షం తీవ్రత స్థాయిని బట్టి సదరు ప్రాంతాల్లో అవసరమైన పనులు చేసేందుకు, చెరువులుగా మారిన రోడ్లపై నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన మాన్సూన్ యాక్షన్ టీమ్స్, ఇతరత్రా విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. త్వరలో రాబోయే వర్షాకాలంలో వర్షం కురవడానికి ముందే వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని వల్నరబుల్ ప్రదేశాల్లోకి జీహెచ్ఎంసీకి చెందిన మాన్సూన్ యాక్షన్ టీమ్స్, ఇతరత్రా విభాగాల సిబ్బంది చేరుకొని తక్షణ చర్యలు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీలోని 150 వార్డుల్లోనూ మాన్సూన్ యాక్షన్ టీమ్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో 150 వార్డుల్లో ఏయే వార్డుల్లో వర్షం కురియనుందో, ఎక్కడ వర్షం రాదో అరగంట ముందుగా తెలిసే సదుపాయం ఉంటుంది. తద్వారా అవసరమనుకున్నప్పుడు వర్షం కురిసే ప్రాంతాల్లోని వల్నరబుల్ ప్రాంతాలకు వర్షం లేని ప్రాంతాలకు చెందిన మాన్సూన్ యాక్షన్ టీమ్స్ కూడా చేరుకుంటాయి. తద్వారా ఎక్కువ సిబ్బందితో తక్కువ సమయంలో పరిస్థితిని యథాతథ స్థితికి తేవడం సాధ్యం కానుంది. ప్రస్తుతం వర్షం Ðð లిశాక ఆయా ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపడుతున్నారు. దాంతో భారీ వర్షాలొచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో రెండు మూడు రోజుల వరకు కూడా పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. రాబోయే వర్షాకాల సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకుగాను వాతావరణశాఖ, జీహెచ్ఎంసీల ఆధ్వర్యంలో ‘వల్నరబుల్ మ్యాప్’ను రూపొందించనున్నారు. దాంతోపాటు కార్యాచరణ మోడల్‌ను కూడా తయారు చేయనున్నారు. వాతావరణశాఖకు చెందిన డాప్లర్ రాడార్‌తో 150 కి.మీ.మేర క్లౌడ్‌ప్యాటర్న్‌ను బట్టి వర్ష సూచనలు తెలుస్తాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 34 వెదర్ స్టేషన్లు(రెయిన్‌గేజ్‌లు)ఉన్నాయి. మరో 120 త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి 2.5 కి.మీల పరిధిలో వీటిని ఏర్పాటుచేస్తారు. గ్రేటర్‌లోని 150 వార్డుల్లోనూ వెదర్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. డాప్లర్ వెదర్ రాడార్ ఇమేజెస్‌ను బట్టి ఏ వార్డులో వర్ష సూచనలున్నాయో తెలుసుకునేందుకు వీలవుతుంది. క్లౌడ్ ఇమేజెస్‌ను బట్టి వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటే వార్డులనూ తెలుసుకోవచ్చు. అందుకనుగుణంగా ఏయే విభాగం ఏయే పనులు చేయాలి..తదితరమైన వాటికి సంబంధించి కార్యాచరణ రూపొందించనున్నారు. అంతకంటే ముందుగా డాప్లర్ రాడార్ ఇమేజెస్, వెదర్‌స్టేషన్లు, వాటి వల్ల తెలుసుకునే సమాచారం, అందుకనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై ఎవరేం చేయాలనేదానికి సంబంధించి అర్బన్ ఫ్లడింగ్ అనే అంశంపై ఈనెలాఖరులోగా బెంగళూర్ ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్‌తోపాటు దేశంలోని వివిధ నగరాలకు చెందిన ఐఐటీ, నిట్ సంస్థల్లోని నిపుణులు,నగరంలోని బిట్స్, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులతో టీఎస్‌డీపీఎస్ సమన్వయంతో ఒక సదస్సు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. సదస్సులో వెలువడే అంశాల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలతో కూడిన ‘కలామిటీ గైడ్’(విపత్తు మార్గదర్శి)రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిస్తే ఏ ప్రాంతం నీట మునుగుతుందో, తరచూ వరదపారే ప్రాంతాలేవో. ఏవి మునుగుతాయో వార్డుల్లో విధులు నిర్వహించే అధికారులకు తెలుసు కనుక వారి సహకారంతో వార్డుల వారీగా వల్నరబుల్‌మ్యాప్‌ను రూపొందించనున్నట్లు టీఎస్‌డీపీఎస్ సీఈఓ మీరా షేక్ తెలిపారు. -
660 జిల్లాల్లో వాతావరణ కేంద్రాలు!
న్యూఢిల్లీ: వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకుని మరింత కచ్చితంగా వర్షపాతాన్ని అంచనా వేసేందుకు 660 జిల్లాల్లో వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐఎండీ (భారత వాతావరణ విభాగం) తెలిపింది. తొలి దశలో 130 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో(కేవీకే)నే వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో వాతావరణ విభాగం ఒప్పందం చేసుకుంది. వారంలో నాలుగు రోజులు (సోమవారం నుంచి గురువారం వరకు) వాతావరణ అంచనాలను ఈ కేంద్రాలు విడుదల చేస్తాయి. 2016 నాటికి దేశంలో 707 జిల్లాలున్నాయి.