MLA Payyavula Keshav Appointed As TDP Social Media Advisor - Sakshi
Sakshi News home page

చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు

Jan 11 2023 2:31 PM | Updated on Jan 11 2023 3:37 PM

MLA Payyavula Keshav Appointed as TDP Social media Advisor - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ఇన్‌ఛార్జిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌కు చంద్రబాబు షాక్‌ ఇచ్చారు. విజయ్‌ స్థాయిని తగ్గించి ఆయనపై మరో ఇద్దరు నేతలు పయ్యావుల కేశవ్‌, జీవీ రెడ్డిని సోషల్‌ మీడియా సలహాదారులుగా నియమించారు. పార్టీలో సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావులకు సోషల్‌ మీడియా బాధ్యతలు అప్పగించడం ద్వారా విజయ్‌కు చెక్‌ పెట్టినట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది.

పయ్యావుల నేతృత్వంలో జీవీ రెడ్డికి సోషల్‌ మీడియా బాధ్యతలు అప్పగించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్‌ ఇకపై కేవలం ఐటీడీపీ బాధ్యతలు మాత్రమే చూస్తూ పయ్యావుల, జీవీ రెడ్డి కింద పనిచేయాల్సి ఉంటుందని టీడీపీ నేతలు చెప్పారు. టీడీపీ సోషల్‌ మీడియా సమర్థంగా పనిచేయడం లేదని చంద్రబాబు భావించడం వల్లే ఈ మార్పులు జరిగినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

చదవండి: (చంద్రబాబుపై బీజేపీ విష్ణువర్ధన్‌ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌)

Advertisement
 
Advertisement
Advertisement