‘చంద్రబాబు డైరెక్షన్‌‌లో రఘురామ కృష్ణంరాజు’ | Minister Vellampalli Srinivas Fires On MP Raghurama Krishnam Raju | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నీచ రాజకీయాలు

Aug 21 2020 11:51 AM | Updated on Aug 21 2020 12:14 PM

Minister Vellampalli Srinivas Fires On MP Raghurama Krishnam Raju - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శుక్రవారం దర్శించుకున్నారు. వేకువజామున అభిషేకం సేవలో కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు సీఎం వైఎస్‌ జగన్‌, రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కరోనా దృష్ట్యా‍ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలు ఇంటికే పరిమితం కావాలని సూచించాయని ఆయన పేర్కొన్నారు.(విశాఖ ఇమేజ్‌ దెబ్బతీయడమే చంద్రబాబు ఆలోచన)

ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘వైఎస్సార్‌ కుటుంబాన్ని ఏ ఒక్క కులానికో, మతానికో అంటకడుతున్నారు. ఢిల్లీలో కూర్చుని రఘురామ కృష్ణంరాజు.. హైదరాబాద్‌లో చంద్రబాబు.. నీచ రాజకీయాలు చేస్తున్నారు. విగ్రహాలు వీధుల్లో పెట్టరాదనే నిర్ణయానికి ముందు అన్ని పార్టీలు, మఠాధిపతులు, పీఠాధిపతులతో మాట్లాడామన్నారు. రఘురామ కృష్ణంరాజు గత ఐదు నెలలుగా ఇంత వరకు ఆయన నియోజకవర్గానికి రాలేదు. నియోజకవర్గం పై అంత ప్రేమ ఉంటే ఎందుకు అక్కడ చవితి వేడుకల్లో పాల్గొనలేదని’’ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేస్తూ.. చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజును ఘాటుగా ఆయన  విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement