‘రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు వెంటపడి కొడతారు’ | Minister RK Roja Fire On TDP And Janasena Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు వెంటపడి కొడతారు’

Oct 10 2022 11:10 AM | Updated on Oct 10 2022 11:44 AM

Minister RK Roja Fire On TDP And Janasena Pawan Kalyan - Sakshi

సాక్షి, తిరుమల: రైతుల ముసుగులో టీడీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి రోజా తిరుమల పర్యటనలో ఉన్న క్రమంలో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం అమరావతి రాజధాని కావాలంటున్నారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విచిత్రమైన ట్వీట్‌ చేశారు. 

టీడీపీ, బీజేపీతో జత కట్టినప్పుడు ఉత్తరాంధ్రలో వలసలు గుర్తురాలేదా?. రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు కొడతారు. హైదరాబాద్‌ వదిలేశాక అనే ఇబ్బందులు పడ్డాము. 29 గ్రామాల కోసం 26 జిల్లాలు పణంగా పెట్టలేము. అమరావతిలోనే కాదు.. రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ రైతులున్నారు. ఇది అమరావతి ఉద్యమం కాదు.. అత్యాసపరుల ఉద్యమం అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement