ఈ-ఆటోలతో ఆర్థిక భారం తగ్గుతుంది: ఆదిమూలపు | Minister Adimulapu Suresh About E Autos | Sakshi
Sakshi News home page

ఈ-ఆటోలతో ఆర్థిక భారం తగ్గుతుంది: ఆదిమూలపు

Jun 8 2023 12:07 PM | Updated on Jun 8 2023 3:27 PM

Minister Adimulapu Suresh About E Autos - Sakshi

సాక్షి, అమరావతి: ఈ-ఆటోలతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘ఐదు క్వింటాళ్ల సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేశాం. వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టాం. కోటి 20 లక్షల డస్ట్‌బిన్‌లను అందించాం. తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక ఏర్పాటు చేశాం. మురుగు నీటిని శుద్ది చేసే ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో చెత్త రహిత రాష్ట్రం సాకారం అవుతుంది. మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేశాం.. కానీ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. రేపు గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. పేదలకు ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్‌ లక్ష్యం’’ అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.
చదవండి: CM Jagan: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement