'మణప్పురం'లో భారీ మోసం | Massive Fraud At Manappuram Draksharama Branch | Sakshi
Sakshi News home page

'మణప్పురం'లో భారీ మోసం

Jun 28 2026 11:16 AM | Updated on Jun 28 2026 11:39 AM

Massive Fraud At Manappuram Draksharama Branch

సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ద్రాక్షారామలోని మణప్పురం ఫైనాన్స్  బ్రాంచ్‌లో భారీ మోసం జరిగింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన అసలు బంగారాన్ని మాయం చేసిన బ్రాంచ్ మాజీ హెడ్.. వాటి స్థానంలో నకిలీ బంగారాన్ని ఉంచారు. వార్షిక తనిఖీల్లో 8 మంది వినియోగదారులకు సంబంధించిన గోల్డ్ ప్యాకెట్లలో అసలు బంగారానికి బదులుగా నకిలీ బంగారం ఉన్నట్లు గుర్తించారు. 

మాయమైన  బంగారం మొత్తం బరువు సుమారు 151 గ్రాములు. దీని విలువ సుమారు 19 లక్షల 63 వేలు ఉంటుందని నిర్ధారించారు. సంస్థ ఏరియా హెడ్ భాను ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement