పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు  | Many trains are canceled and diverted | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు 

Sep 13 2023 2:41 AM | Updated on Sep 13 2023 2:41 AM

Many trains are canceled and diverted - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): సికింద్రాబాద్‌ డివిజన్‌లోని మాకుడి–సీర్పూర్‌ టౌన్‌ సెక్షన్‌ మధ్యలో నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయంతో పాటు, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ధనాపూర్‌–సికింద్రాబాద్‌ (03225), 22న హైదరాబాద్‌–గోరఖ్‌పూర్‌ (02575), 23న హైదరాబాద్‌–రక్షౌ ల్‌ (07051), 24న సికింద్రాబాద్‌–ధనాపూర్‌ (03226), గోరఖ్‌పూర్‌–హైదరాబాద్‌ (02576), 26న రక్షౌ ల్‌–హైదరాబాద్‌ (07052) రైళ్లను రద్దు చేశారు.

ఈ నెల 22 నుంచి 25 వరకు ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌–అహ్మదాబాద్‌ (12656) రైలును పెద్దపల్లి, నిజామాబాద్, పూర్ణా, అకోలా మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా ఈ నెల 22 నుంచి 25 వరకు యశ్వంత్‌పూర్‌– హజరత్‌ నిజాముద్దిన్‌ (12649) రైలును, అలాగే ఈ నెల 18, 19, 21, 23, 24, 25 తేదీల్లో హజరత్‌ నిజాముద్దిన్‌–యశ్వంత్‌పూర్‌ (12650) రైలును బళ్లారి, గుంతకల్లు, వాడి, మన్మడ్, ఖాండ్వా, ఇటార్సీ స్టేషన్‌ల మీదుగా దారి మళ్లించారు. 

Advertisement
 
Advertisement
Advertisement