‘నిన్ను.. నీ ఇద్దరు పిల్లలను చూసుకుంటా లిల్లీ’ | Man Cheating Married women in tirupati | Sakshi
Sakshi News home page

‘నిన్ను.. నీ ఇద్దరు పిల్లలను చూసుకుంటా లిల్లీ’

Aug 25 2026 11:53 AM | Updated on Aug 25 2026 12:34 PM

Man Cheating Married women in tirupati

తిరుపతి: పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసి తర్వాత వదిలివేయడంతో తిరుపతికి చెందిన లిల్లీ అనే యువతి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైలవరం ఎస్‌ఐ శ్యామ్‌సుందర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం నార్జాంపల్లెకు చెందిన సుధాకర్‌ యాదవ్‌ తిరుపతి రూరల్‌ మండలం చెర్లోపల్లెలో టిఫిన్‌ సెంటర్‌ నడుపుతున్న లిల్లీ వద్దకు వెళ్లేవాడు. 

ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం కావడంతో సుధాకర్‌ యాదవ్‌ తనకు వివాహం కాలేదని, నిన్ను నీ ఇద్దరు పిల్లలను నేను చూసుకుంటానని నమ్మించాడు. దీంతో లిల్లీ కూడా భర్త లేకపోవడంతో అంగీకరించింది. అయితే సుధాకర్‌ యాదవ్‌కు అప్పటికే వివాహమైందనే విషయం తెలుకుని లిల్లీ  ప్రశ్నించింది. 

దీంతో సుధాకర్‌ యాదవ్‌ కూల్‌ డ్రింక్స్‌లో మద్యం కలిపి లిల్లీకి తాగించి ఆమె ఫోన్‌లో వివరాలను తొలగించేశాడు. సుధాకర్‌ యాదవ్‌ తరఫున బంధువులైన బాలయ్య, లక్ష్మీదేవి, పార్వతీ, శ్రీదేవి తమ పెళ్లి జరిపిస్తామని హమీ ఇచ్చారని బాధితురాలు తెలిపారు. చివరికి కులంపేరుతో దూషించి దాడి చేసి మోసం చేసి తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారంటూ ఆరోపించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. 

చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement