breaking news
Lily
-
‘నిన్ను.. నీ ఇద్దరు పిల్లలను చూసుకుంటా లిల్లీ’
తిరుపతి: పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసి తర్వాత వదిలివేయడంతో తిరుపతికి చెందిన లిల్లీ అనే యువతి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైలవరం ఎస్ఐ శ్యామ్‌సుందర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం నార్జాంపల్లెకు చెందిన సుధాకర్ యాదవ్ తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లెలో టిఫిన్ సెంటర్ నడుపుతున్న లిల్లీ వద్దకు వెళ్లేవాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం కావడంతో సుధాకర్ యాదవ్ తనకు వివాహం కాలేదని, నిన్ను నీ ఇద్దరు పిల్లలను నేను చూసుకుంటానని నమ్మించాడు. దీంతో లిల్లీ కూడా భర్త లేకపోవడంతో అంగీకరించింది. అయితే సుధాకర్ యాదవ్‌కు అప్పటికే వివాహమైందనే విషయం తెలుకుని లిల్లీ ప్రశ్నించింది. దీంతో సుధాకర్ యాదవ్ కూల్ డ్రింక్స్‌లో మద్యం కలిపి లిల్లీకి తాగించి ఆమె ఫోన్లో వివరాలను తొలగించేశాడు. సుధాకర్ యాదవ్ తరఫున బంధువులైన బాలయ్య, లక్ష్మీదేవి, పార్వతీ, శ్రీదేవి తమ పెళ్లి జరిపిస్తామని హమీ ఇచ్చారని బాధితురాలు తెలిపారు. చివరికి కులంపేరుతో దూషించి దాడి చేసి మోసం చేసి తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారంటూ ఆరోపించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం! -
కాగితంతో లిల్లీ పువ్వు
కావలసినవి: రంగు కాగితాలు, స్ట్రా, పెన్సిల్, కత్తెర, జిగురు, టేప్ చేసే పద్ధతి తెల్ల కాగితంపై లిల్లీపువ్వు రేకులను బొమ్మలో చూపిన విధంగా గీయండి. తెల్ల కాగితాన్ని లిల్లీ పువ్వు రేకుల ఆకారంలో కత్తిరించండి. ఇప్పుడు మొదటి రేకును చివరి రేకును జిగురుతో అతికించండి. ఈ పువ్వును స్ట్రాకి ఒక చివర టేప్‌తో అతికించండి. పసుపు రంగు కాగితాన్ని స్ట్రా పై అంటించండి. ఆకుపచ్చ రంగు కాగితాన్ని, కొన్ని ఆకులను తయారు చేసుకోండి. ఈ ఆకులను స్ట్రాకి రెండు వైపుల అంటించండి. కాగితం లిల్లీపువ్వు రెడీ!


