విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం | Lover Attack On Mother And Daughters In Madhurawada Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం

Apr 2 2025 2:59 PM | Updated on Apr 2 2025 6:07 PM

Lover Attack On Mother And Daughters In Madhurawada Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. గతంలో న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మధురవాడలో జరిగిన మరో ఘటన నగరంలో కలకలం రేపుతోంది. ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి చెందగా, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ప్రేమోన్మాది నవీన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతురాలు లక్ష్మి చెల్లి సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు నవీన్‌ను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ డిమాండ్‌ చేసింది. పెళ్లి చేస్తామని చెప్పిన కానీ దారుణంగా చంపాడు. కాళ్లు, చేతులు నరికి నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆమె అన్నారు.

విశాఖ మధురవాడలో దారుణం

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement