కోస్తాంధ్రపై కొనసాగుతున్న ఆవర్తనం | Light rains for the next three days | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రపై కొనసాగుతున్న ఆవర్తనం

Published Thu, Jun 20 2024 5:48 AM | Last Updated on Thu, Jun 20 2024 5:48 AM

Light rains for the next three days

వచ్చే మూడు రోజులు తేలికపాటి వర్షాలు

ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు

సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 

గురు­వారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు, శుక్ర, శనివారాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 

అదే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement