నిస్సి సూసైడ్‌ నోట్‌ లభ్యం.. లెటర్‌లో ఏముందంటే? | Letter Found In Gudur Woman Case | Sakshi
Sakshi News home page

నిస్సి సూసైడ్‌ నోట్‌ లభ్యం.. లెటర్‌లో ఏముందంటే?

Jan 30 2025 3:52 PM | Updated on Jan 30 2025 4:46 PM

Letter Found In Gudur Woman Case

: గూడూరులోని పంబలేరు వాగులో నిస్సి మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ లెటర్‌ను గుర్తించారు.

సాక్షి, తిరుపతి జిల్లా: గూడూరులోని పంబలేరు వాగులో నిస్సి మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. తనను పెళ్లి చేసుకోబోయే చైతన్య అనే అబ్బాయికి లెటర్ రాసిన మృతురాలు.. చైతన్యను జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని.. అతనంటే తనకెంతో ఇష్టమంటూ లేఖలో పేర్కొంది.

అయితే ఆత్మహత్యకు గల కారణాలను నోట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు. మరో వైపు, అందరినీ వదిలి వెళిపోతున్నా.. మిస్‌ యూ అంటూ నోట్ రాసి ఇంట్లోనే పెట్టింది. యువతి అదృశ్యం అనంతరం.. ఇంట్లో ఉన్న నోట్‌ను కుటుంబ సభ్యులు గుర్తించారు.

కాగా, గూడూరులో యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న యువతి వివాహం జరగాల్సి ఉండగా, రెండు రోజుల క్రితం అదృశ్యమైంది.. ఇవాళ వాగులో మృతదేహం లభ్యమైంది. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement