మచిలీపట్నం కలెక్టరేట్‌లో.. కాబోయే కలెక్టర్‌-ఎస్పీలు.. సింపుల్‌గా దండలు మార్చేసుకున్నారు

krishna joint collector aparajitha marries trainee ips devendra - Sakshi

సాక్షి, కృష్ణా: కాబోయే కలెక్టర్‌.. కాబోయే ఎస్పీల వివాహం నిరాడంబరంగా జరిగింది. అదీ రిజిస్టర్‌ మ్యారేజ్‌గా సింపుల్‌గా దండలు మార్చుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అయిన అపరాజిత సింగ్‌, ట్రైనీ ఐపీఎస్‌ దేవేంద్ర కుమార్‌ను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.

మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌ వీళ్ల వివాహానికి వేదిక అయ్యింది. వీళ్లిద్దరిదీ రాజస్థాన్‌ కావడం గమనార్హం. ఈ కొత్త జంటకు కలెక్టర్‌ రాజాబాబు, కలెక్టరేట్‌ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. వివాహం తర్వాత కొత్త జంట గుడ్లవల్లేరు వేమవరంలోని శ్రీకొండాలమ్మ ఆలయాన్ని దర్శించారు. ఇదిలా ఉండగా..  దేవేంద్ర కుమార్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top