
తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,027 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్ధు చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.