సాక్షి, విశాఖపట్నం: సీఐఐ సమ్మిట్ సాక్షిగా క్రెడిట్ చోరీ బట్టబయలైంది. చంద్రబాబు బండారాన్ని కరణ్ అదానీ బట్టబయలు చేశారు. డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నట్టు కరణ్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హయాంలోనే ఏపీకి అదాని డేటా సెంటర్ ఒప్పందానికి బీజం పడిన సంగతి తెలిసిందే. గూగుల్ పార్ట్‌నర్‌షిప్‌తో డేటా సెంటర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇవాళ సమ్మిట్ ప్రారంభోత్సవంలో కరణ్ అదానీ ప్రకటించారు.
గూగుల్ పార్ట్‌నర్‌షిప్‌తో బిగెస్ట్ డేటా సెంటర్‌ను ఏపీలో నిర్మిస్తున్నామన్నారు. ఏపీలో డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లో అదానీ పనిచేస్తోందన్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, లక్షకుపైగా ఉద్యోగాలను కూడా అదానీ సంస్థ కల్పించిందన్నారు. ఏపీలో వృద్ధిలో అదానీ సంస్థ భాగస్వామి అవుతోందని కరణ్ తెలిపారు. ఇదే విషయం గతంలో వైఎస్ జగన్ ఆధారాలతో వెల్లడించారు. అదానీ పేరు చెప్పకుండా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు. చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కరణ్ నిజం బయటపెట్టారు.

ఇదీ చదవండి: క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్


