breaking news
chor
-
‘భోగాపురం ఎయిర్‌పోర్టులోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ’
సాక్షి, విశాఖపట్నం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్‌ది కాగా, నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం నాడే పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్‌గారు, అందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారని వెల్లడించారు.ఇప్పుడు ఆ రహదారి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆయన, భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు సమాధానం చెప్పాలని కోరారు. ఆ మెయిన్ కనెక్టివిటీ రోడ్డుపై ఇప్పటివరకు డీపీఆర్ సిద్ధం కాలేదని, రోడ్ అలైన్‌మెంట్‌కూ ఇంకా ఆమోదం రాలేదని, అయినా పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని విశాఖలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఏం మాట్లాడారంటే..:తప్పుదోవ పట్టిస్తున్న కూటమి నేతలు:ఉత్తరాంధ్ర ప్రజలను గత కొంతకాలంగా కూటమి నేతలు అబద్ధాలు, అసత్యాలతో తప్పుదోవ పట్టిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ట్రయల్ రన్ జరిగిన సందర్భంగా, దీనంతటికీ తామే కారణమని చంద్రబాబు, లోకేష్ తదితరులు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు శంకుస్థాపన చేసిన సమయంలో కేవలం 377 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగింది, అంతటితో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం సాధ్యమే కాదు.జగన్ వల్లనే భోగాపురం ఎయిర్పోర్ట్:2019లో జగన్ సీఎం కాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్లారు. 2020లో ఎయిర్‌పోర్టు నిర్మాణ ఒప్పందాలు, 2021లో భూసేకరణ ప్రారంభం, 2022లో ఎన్వోసీలు, 2023 జనవరిలో భూసేకరణ పూర్తి చేసి, అదే ఏడాది మే 3న పనులు ప్రారంభించారు. 2026 జూన్ నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని అప్పుడే టైమ్ ఫ్రేమ్ ఇచ్చారు. పనుల్లో జీఎంఆర్ సంస్థ కూడా ఎక్కడా అలక్ష్యం చూపలేదు. మరోవైపు జగన్ చొరవతో వైజాగ్ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో రోడ్డు సహా, అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు.ఎయిర్‌పోర్టుకు రోడ్ కనెక్టివిటి ఏదీ?:ఏమీ చేయకపోయినా అన్నీ తామే చేశామని చెప్పుకుంటూ, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, నిజానికి నాటి మాస్టర్ ప్లాన్ ప్రకారం విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో మెయిన్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో విశాఖ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు పక్కా రోడ్ కనెక్టివిటీ లేకుండా పోయింది. మరి దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఏం సమాధానం చెబుతారు?.ఇప్పుడు విశాఖ, భోగాపురం మధ్య ఒక్క రోడ్డు మాత్రమే ఉండగా, ఆనందపురం జంక్షన్లో తీవ్ర ట్రాఫిక్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 మీటర్ల వెడల్పు రోడ్డుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, డీపీఆర్, అలైన్మెంట్ ఇప్పటివరకు సిద్ధం కాలేదు. అనుమతులూ తీసుకోలేదు. అయినా కూటమి నేతలు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని కెకె రాజు దుయ్యబట్టారు. -
సీఐఐ సమ్మిట్ సాక్షిగా బట్టబయలైన ‘క్రెడిట్ చోరీ’
సాక్షి, విశాఖపట్నం: సీఐఐ సమ్మిట్ సాక్షిగా క్రెడిట్ చోరీ బట్టబయలైంది. చంద్రబాబు బండారాన్ని కరణ్ అదానీ బట్టబయలు చేశారు. డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నట్టు కరణ్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హయాంలోనే ఏపీకి అదాని డేటా సెంటర్ ఒప్పందానికి బీజం పడిన సంగతి తెలిసిందే. గూగుల్ పార్ట్నర్షిప్తో డేటా సెంటర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇవాళ సమ్మిట్ ప్రారంభోత్సవంలో కరణ్ అదానీ ప్రకటించారు.గూగుల్ పార్ట్నర్షిప్తో బిగెస్ట్ డేటా సెంటర్‌ను ఏపీలో నిర్మిస్తున్నామన్నారు. ఏపీలో డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లో అదానీ పనిచేస్తోందన్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, లక్షకుపైగా ఉద్యోగాలను కూడా అదానీ సంస్థ కల్పించిందన్నారు. ఏపీలో వృద్ధిలో అదానీ సంస్థ భాగస్వామి అవుతోందని కరణ్ తెలిపారు. ఇదే విషయం గతంలో వైఎస్ జగన్ ఆధారాలతో వెల్లడించారు. అదానీ పేరు చెప్పకుండా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు. చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కరణ్ నిజం బయటపెట్టారు.ఇదీ చదవండి: క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ -
చంద్రబాబు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుందంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. క్రెడిట్ చోర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్‌తో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా.. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా.. ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా.. గత ప్రభుత్వం అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ… ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు’’ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.‘‘మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలోఉన్నవే. ఇవికాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా… అసలు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం!చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది.పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా……— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2025..మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి…కోవిడ్‌లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తిచేసినా, అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం..చంద్రబాబూ.. మేము 31.9 ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం!. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్లస్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. -
అనుబ్రతా మోండల్‌కు అవమానం!.. ‘షూ’ చూపిస్తూ ‘చోర్’ అంటూ నినాదాలు!
కోల్‌కతా: పశువుల అక్రమ రవాణా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన టీఎంసీ సీనియర్ నాయకుడు అనుబ్రతా మోండల్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆయనకు నిరసనల సెగ తగిలింది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు చోర్ చోర్(దొంగ) అంటూ అరిచారు. కొందరు చెప్పులు, బూట్లు విసిరారు. ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు అనుబ్రతా మోండల్‌ను తీసుకొచ్చే క్రమంలో న్యాయస్థానం ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ కారు దిగగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు భద్రత మధ్య కోర్టులోకి వెళ్లారు అనుబ్రతా మోండల్. విచారించిన కోర్టు ఆయనకు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. #WATCH | West Bengal: Anger in people as they show shoes, shout slogans of 'chor, chor' during the production of TMC Birbhum district president Anubrata Mondal in a special CBI court of Asansol. Mondal had been arrested by the CBI in a cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6 pic.twitter.com/Z8yqQWI3JE — ANI (@ANI) August 11, 2022 ఏంటీ కేసు? 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదీ చదవండి: Anubrata Mondal Arrested: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత -
గొల్లుమన్న జనం.. బిత్తరపోయిన మాల్యా
లండన్: భారత ప్రభుత్వాన్ని, బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సైటర్లతో మాల్యాపై విరుచుకుపడుతున్న సామాన్య జనం నేరుగా ఆయనకు ఝలక్ ఇచ్చారు. ఊహించని పరిణామంలో మాల్యా ఒక్కసారిగా బిత్తరపోయారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను తిలకించేందుకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవర్ మైదానానికి వచ్చారు. నీలం రంగు సూటులో మెరిసిపోతూ స్టేడియం లోపలికి వెళుతున్న మాల్యాను చూసి టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా ‘దొంగ, దొంగ’ అంటూ కేకలు వేస్తూ ఆయనను చుట్టుముట్టారు. ఊహించని పరిణామంలో షాక్ తిన్న మాల్యా వడివడిగా స్టేడియం లోపలకు వెళ్లిపోయారు. భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి లండన్ పారిపోయిన మాల్యా అక్కడ దర్జాగా తిరుగుతున్నారు. గత ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను కూడా స్టేడియంలో కూర్చుని ప్రత్యక్షంగా తిలకించారు. కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్వహించిన ‘చారిటీ డిన్నర్’ హాజరై టీమిండియా క్రికెటర్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు.


