Janasena Chief Pawan Kalyan Vizianagaram District Tour Utter Flopped - Sakshi
Sakshi News home page

విజయనగరం జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌.. తీవ్ర అసహనం

Nov 13 2022 4:47 PM | Updated on Nov 13 2022 5:46 PM

Janasena Chief Pawan Kalyan tour Utter Flop in Vizianagaram district - Sakshi

సాక్షి, విజయనగరం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గుంకలాం జగనన్న కాలనీ పర్యటన అట్టర్‌ ప్లాప్‌ అయింది. జగనన్న గృహ లబ్ధిదారుల నుంచి కనీస స్పందన కరువైంది. గత కొద్ది రోజులుగా జనసేన నాయకులు జగనన్న ఇళ్లు పేదల కన్నీళ్లు అంటూ ప్రచారం చేశారు. అయినా కూడా ఒక్క లబ్ధిదారుడు కూడా తమకు నష్టం వచ్చిందని చెప్పకపోవడంతో పవన్‌ కల్యాణ్‌ కంగుతిన్నారు.

జనసేన నాయకులు గత మూడు రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పమని లబ్ధిదారులను తీవ్రంగా ప్రలోభ పెట్టారు. అయినా లబ్ధిదారుల నుంచి స్పందన లేకపోవడంతో కారుపై నుంచి పవన్‌ ఒక్కరే ప్రసంగించి పర్యటననను ముగించారు. అనంతరం.. తనకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ జిల్లా జనసేన నాయకులపై పవన్‌ కల్యాణ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

చదవండి: (రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement