బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్‌ ట్విస్ట్‌ | Big Shock To Chandrababu Naidu Over IT Issues Show Cause Notice - Sakshi
Sakshi News home page

బ్లాక్‌మనీ యవ్వారం.. ఐటీ నోటీసులు.. చంద్రబాబు ఊహించి ఉండడు

Published Fri, Sep 1 2023 9:18 AM

IT Show Cause Notice Big Shock To Chandrababu Naidu - Sakshi

సాక్షి, ఢిల్లీ: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊహించని ఝలక్‌ తగిలింది. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి మరీ..  షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది ఆదాయ పన్నుల శాఖ.  చంద్రబాబు వద్ద ఉన్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగానే  గుర్తించింది ఐటీ శాఖ. ఈ పరిణామాలను చంద్రబాబు అస్సలు ఊహించి ఉండడు. 

సీఎంగా ఉన్న టైంలో ఇన్ఫ్రా  సంస్థల సబ్ కాంట్రాక్టు ల రూపంలో రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారాయన. ఈ క్రమంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చాడు కూడా. అందుకే తాజా నోటీసుల్లో.. ఇన్‌ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగా(వెల్లడించని)ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును కోరింది ఐటీ శాఖ. అంతకు ముందు రీ అస్సెస్ చేయాలని చంద్రబాబు కోరగా.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించింది ఐటీ శాఖ. ఆపై నోటీసులు జారీ చేసింది. 

2016 నుంచి 2019 మధ్య నడిచిన ముడుపుల బాగోతం నడిచింది. ఐటీ శాఖ అధికారులు.. షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల చేపట్టగా.. ఈ స్కాం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా  నగదు స్వాహా చేసినట్లు ఒప్పుకున్నాడు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి). షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు.. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే  సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగింది. 2016లో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ తో టచ్‌లో ఉంటూ వచ్చిన పార్థసారథి.. ఆ శ్రీనివాస్‌ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపుల్ని తన బాస్‌ చంద్రబాబుకు అందించారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అయితే.. బోగస్‌ సబ్‌ కాంట్రాక్టుల ద్వారా బాబు లబ్ధి పొందినట్లు నోటీసుల్లో పేర్కొంది ఐటీ. 

2017లో బాబు మయాంలో షాపూర్‌ జీ సంస్థ తరపున ఎంవీపీ టెండర్‌ వేశారు. ఎంవీపీ కంపెనీ, అనుబంధ సంస్థపై 2019లో సోదాలు నిర్వహించింది. ఐటీ శాఖ. ఆ సమయంలో బోగస్‌ సబ్‌ కాంట్రాక్ట్‌ పేరుతో నిధులు మళ్లించిన విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఎంవీపీ కార్యాలయం నుంచి కీలక పత్రాలు, ఎక్సెల్‌షీట్లు, కీలకమైన మెసేజ్‌లు స్వాధీనం చేసుకున్నారు కూడా. ఇక నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ఐటీ.. మళ్లిన ఆ నిధులు చంద్రబాబుకు చేరినట్లు అభియోగం నమోదు చేసింది. 

2016లో ఆగష్టులో చంద్రబాబు నాయుడు సెక్రటరీ శ్రీనివాస్‌ తనను కలిసి.. పార్టీకి ఫండ్‌ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ  ఐటీకి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.  

బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందగా.. ప్రాథమిక ఆధారాలు సేకరించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు.ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు అందిన విషయాన్ని  హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక బయటపెట్టింది.

ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్‌ కంపెనీలు సృష్టించి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో ఈ అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ విషయాన్నే ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ వెల్లడించింది కూడా. ఇక.. చంద్రబాబు నేర చరిత్ర ఇదే కాదు.. ఇంకా చాలా ఉంది. 

ఇదీ చదవండి: గ్యారెంటీ లేని బాబు ష్యూరిటీ.. జనం నమ్ముతారా?

Advertisement
 

తప్పక చదవండి

Advertisement