108 వాహనాల్లో పాము కాటుకు ఇంజెక్షన్‌లు | Injections for snake bites in 108 vehicles | Sakshi
Sakshi News home page

108 వాహనాల్లో పాము కాటుకు ఇంజెక్షన్‌లు

Aug 9 2026 5:29 AM | Updated on Aug 9 2026 5:29 AM

Injections for snake bites in 108 vehicles

సాక్షి, అమరావతి: పాము కాటు బాధితుల కోసం 108 అంబులెన్సుల్లో యాంటీ స్నేక్‌ వీనం ఇంజెక్షన్‌లను అందుబాటులో తెచ్చినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో చక్రధర్‌బాబు శనివారం తెలిపారు. పాముకాటు అత్యవసర కాల్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. గతేడాది జూన్‌ నుంచి 3,104 మంది పాముకాటు బాధితుల తరలింపు కోసం కాల్‌ సెంటర్‌కు ఫోన్‌లు వచ్చాయన్నారు.  కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురికి ఈఎంటీలు పాముకాటు విరుగుడు ఇంజెక్షన్‌లు అందించినట్టు చెప్పారు. వారికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement