ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట | Huge Relief For Sakshi TV In AP High Court For Illegal Case, Watch More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట

Jun 20 2025 1:23 PM | Updated on Jun 20 2025 3:03 PM

Huge Relief For Sakshi Tv In Ap High Court

సాక్షి, అమరావతి: అక్రమ కేసులపై కూటమి సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట లభించింది. కేఎస్‌ఆర్‌(కొమ్మినేని శ్రీనివాసరావు) లైవ్‌ షోకు సంబంధించి సాక్షి టీవీపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. సాక్షి టీవీపై తదుపరి చర్యలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేనికి సుప్రీం కోర్టు  బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పాత్రికేయుల వాక్‌ స్వాతంత్య్ర హక్కును హరించిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను తప్పుపట్టింది. లైవ్‌ షోలో ఓ ప్యానలిస్ట్‌ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్‌ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వాక్‌ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. 

సాక్షి మీడియాపై కుట్రతోనే..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షి మీడియా యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ అందుకు నిదర్శనం.  అసలు ఉదంతంతో  ఏ మాత్రం సంబంధం లేని బీఎన్ఎస్ సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్లు 79, 196(1), 353(2), 299, 356(2) 61(1) కింద కేసు నమోదు చేయడం. ప్రభుత్వ కుట్రకు తార్కాణం.

ఎందుకంటే కుట్రపూరితంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం, విద్వేషాలను వ్యాపింప చేయడం తదితర నేరాలకు ఈ సెక‌్షన్లు వర్తిస్తాయి. అంతేగానీ ఓ టీవీ చానళ్లో స్వతంత్ర విశ్లేషకుడు వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఆ సెక్షన్లు నమోదు చేయడం విడ్డూరం. అసలు చర్చా గోష్ఠిలో ఎక్కడా కుల ప్రస్తావనే లేకపోయినా, బీఎన్ఎస్ 3(1)(యు) సెక్షను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉండన్నది సుస్పష్టం. 

‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్‌ చేసేస్తారా. నవ్వడమే తప్పయితే, మేం ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటాం.  లైవ్‌ షోలో ప్యానలిస్ట్‌ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదు. ఓ జర్నలిస్టుగా లైవ్‌ న్యూస్‌ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉంది. అప్పుడే  ఆయన వాక్‌ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుంది’’  

:::కొమ్మినేనికి బెయిల్‌ సందర్బంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement