ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు | Huge rally of farmers in Santipuram | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

Nov 3 2020 3:50 AM | Updated on Nov 3 2020 3:50 AM

Huge rally of farmers in Santipuram - Sakshi

పాలారు వంతెన వద్ద సాగుతున్న ర్యాలీ

శాంతిపురం (చిత్తూరు జిల్లా): వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా తమను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు ట్రాక్టర్లతో స్వచ్ఛందంగా తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం బడుగుమాకులపల్లి నుంచి మండల సచివాలయం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఎంపీ రెడ్డెప్ప, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వందల సంఖ్యలో ట్రాక్టర్లు దాదాపు కిలోమీటరు మేర వరుస కట్టాయి. ర్యాలీ మధ్యలో కేజీఎఫ్‌ సర్కిల్‌లోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూజలు చేసి నివాళి అర్పించారు. బాణాసంచా మోత, జై జగన్‌ నినాదాలతో మండల కేంద్రం మార్మోగింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement