పేట్రేగిన పచ్చమూకలు | High tension during the nomination process for ap local body elections | Sakshi
Sakshi News home page

పేట్రేగిన పచ్చమూకలు

Oct 18 2026 3:17 AM | Updated on Oct 18 2026 3:17 AM

High tension during the nomination process for ap local body elections

కడపలో గాంధీనగర్‌ నామినేషన్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మద్దతుదారులపై కట్టెలతో దాడి చేస్తున్న టీడీపీ గూండాలు

నారాసుర డైరెక్షన్‌ 

జంగిల్‌రాజ్‌ పాలనలో రెండోరోజు కొనసాగిన అరాచకం    

రాష్ట్ర వ్యాప్తంగా భౌతిక దాడులకు దిగిన పచ్చ మూకలు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తతలు

వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు 

కత్తులు, వేట కొడవళ్లు, రాడ్లు, కర్రలతో రెచ్చిపోయిన ఎల్లో రౌడీలు 

పులివెందులలో పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా అడ్డగింత  

కడప జిల్లాలో ముఖ్య నేతల నిర్బంధం.. నామినేషన్‌ పత్రాలు చింపివేత 

పల్నాడు జిల్లా గురజాల, పిడుగురాళ్లలో అభ్యర్థులను అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన పోలీసులు 

తిరుపతిలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయిని అడ్డుకున్న పోలీసులు 

మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డిలపై అక్రమ కేసు 

పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులు.. హెచ్చరికలు  

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి అర్థం మారిపోయింది.. నారాసుర పాలనలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అయ్యింది.. హత్యా యత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాల మధ్య నామినేషన్‌ వేయొద్దంటూ అడుగడుగునా బెదిరింపులు.. హెచ్చరికలు.. పోలీసులే పచ్చ మూకలను దగ్గరుండి ప్రోత్సహిస్తున్న దుస్థితి.. కాదు కూడదని ఎవరైనా లోపలికెళ్తే మూకుమ్మడి దాడులు.. నామినేషన్‌ పత్రాలు చింపివేత.. అధికారుల వద్ద నుంచి పత్రాలను లాక్కెళ్లి పోవడం.. ఆటవిక పాలన కూడా ఇంత దారుణంగా ఉండదన్నట్లు దౌర్జన్యాలు.. కర్రలు, కత్తులు, రాడ్లు, రాళ్ల దాడులతో రౌడీ మూకలు పేట్రేగిపోతుంటే ఎన్నికల కమిషన్‌ గుడ్లప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేక పోతోంది. టీడీపీ రౌడీల దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు చూసి కాలకేయులు, తాలిబన్లు, దుర్యోధన, దుశ్శాసనులు సైతం సిగ్గు పడే పరిస్థితి దాపురించింది. పోలీసింగ్‌పై  ఉన్న గౌరవం పాతాళానికి పడిపోయింది.

సాక్షి, అమరావతి: హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలతో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల రెండవ రోజు కూడా అరాచకపర్వం కొనసాగింది. నారా సుర డైరెక్షన్‌లో కాలకేయులను మించి చెలరేగిపోయిన ఎల్లో మూకల ఆగడాలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెన్నుపోటు పార్టీకి పోలీసులు సైతం వెన్నుదన్నుగా నిలవడంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. జంగిల్‌రాజ్‌ పాలనలో ఎల్లో రౌడీలు కత్తులు, వేట కొడవళ్లు, రాడ్లు, కర్రలు, పెట్రోల్‌ బాటిల్స్‌తో పేట్రేగిపోవడంతో రాష్ట్రం యావత్తు నివ్వెరపోయింది. 

అనేక జిల్లాల్లో తాలిబన్లకు మించి రెచ్చిపోయిన పచ్చ మూక భౌతిక దాడులకు దిగింది. పల్నాడు జిల్లా గురజాల, పిడుగురాళ్లలో పోలీసులు అర్థరాత్రి వేళ వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి అభ్యర్థులను ఎత్తుకుపోయారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డైరెక్షన్‌లో నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థు«లపై ఎలాంటి కేసులు లేనప్పటికీ గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల సీఐలు మురళి, ఖాజావలి, వెంకట్రావులు పోలీస్‌ వ్యవస్థకే మచ్చ తెల్చేలా పసుపు చొక్కాలు వేసుకొని మరీ ఊడిగం చేస్తున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌న్‌అభ్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు దాటినా ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేక ఓట్ల కోసం వెళితే చీదరింపులు తప్పవని గ్రహించి.. పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లిలో దౌర్జన్యకాండ సృష్టించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. గురజాల నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థి పోలు వీరారెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు యనుమల మురళీధర్‌రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లను టౌన్‌ సీఐ మురళి మాట్లాడాలని పిలిపించి ప్రైవేట్‌ వాహనంలో మారుమూల ప్రాంతానికి తరలించారు. 

పిడుగురాళ్ల సీనియర్‌ నేత, సర్పంచ్‌ చల్లా శివారెడ్డిని అర్ధరాత్రి 1.30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైన గుర్రం అప్పిరెడ్డి, నంద్యాల బాబు, కందుకూరు శీను, ఈర్ల శివ, మంద ఆనంద్, వేముల కిరణ్, ఓర్సు దుర్గాప్రసాద్, అల్లు పిచ్చిరెడ్డి, మంద సుధీర్, కణాల శ్రీనివాసరెడ్డిలను సైతం అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కొప్పుల సాంబయ్య ఆధ్వర్యంలో నామినేషన్లకు వెళ్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దౌర్జన్యకాండను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.

పచ్చ నేతలకు దన్నుగా పోలీసులు
దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్మన్‌న్‌అభ్యర్థి కొప్పుల రవి శుక్రవారం నామినేషన్‌ వేయడానికి సిద్ధం కాగా, గురువారం రాత్రే  బలవంతంగా ఎత్తుకెళ్లి అక్రమ కేసు పెట్టి జైలులో నిర్బంధించారు. ఆయన కుటుంబ సభ్యులు, వార్డు కౌన్సిలర్లుగా పోటీచేసే వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం నామినేషన్‌న్‌దాఖలు చేసేందుకు వెళుతుంటే సీఐ ఖాజావలి నేతృత్వంలో అడ్డుకొని వెళ్లటానికి వీలులేదని హెచ్చరికలు చేశారు. కొంత సమయం తర్వాత రెండో విడత నామినేషన్‌ వేసేందుకు వెళ్లే మహిళల చేతుల్లో ఉన్న నామినేషన్‌ పత్రాలను పచ్చ గూండాలు లాక్కొని చింపివేశారు. అక్కడున్న పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారు. దీంతో కోపోద్రిక్తులైన వైఎస్సార్‌సీపీ నేతలు, మహిళలు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. 

గురజాల నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థి పోలు వీరారెడ్డి శనివారం ఉదయం నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైనట్లు తెలుసుకున్న గురజాల సీఐ మురళి శుక్రవారం రాత్రే ఆయన్ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అతనితో పాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు ఎనుముల మురళీధర్‌రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లును నాగార్జునసాగర్‌ పోలీసుస్టేషన్‌కు తరలించి అక్కడ అక్రమంగా నిర్బంధించారు. దీనిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు ప్రివెంటీవ్‌ అరెస్టు అంటూ బైండోవర్‌ చేసి శనివారం రాత్రి గురజాల తహసీల్దారు ఎదుట హాజరు పరిచారు. 

పిడుగురాళ్ల మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం వైఎస్సార్‌సీపీ నుంచి ఒక్క అభ్యర్థి కూడా నామినేష¯Œన్‌ వేయడానికి వీలు లేదని పచ్చ గూండాలు బహిరంగంగా హెచ్చరికలు చేశారు. నామినేషన్‌ వేస్తే చంపుతామని బెదిరించారు. మీడియా కూడా రావడానికి వీలు లేదని ఆంక్షలు విధించారు. ఘర్షణలకు పాల్పడాలనే ఉద్దేశ్యంతో నామినేషన్‌ కేంద్రాల సమీపంలో టీడీపీ గూండాలు రాళ్ల గుట్టలు సిద్ధం చేసుకున్నారు.  

కడపలో ఏకే–47తో పోలీస్‌ కాల్పులు 
వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎల్లో మూక కత్తులు, కర్రలతో దాడులకు దిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంది. పచ్చ మూక ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వడం, గాలిలోకి ఏకే–47తో కాల్పులు జరపడం దారుణం. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు. మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి నివాసానికి వెళ్లి 163 సెక్షన్‌ కింద నోటీసులు ఇచ్చారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ నాయకుడి చికెన్‌ సెంటర్‌కు పచ్చమూక నిప్పు పెట్టింది. ఘటనా స్థలాన్ని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పరిశీలించడంతో ఆయనకు పోలీసులు 144 సెక్షన్‌ నోటీసులు జారీ చేశారు.

కడపలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద మాజీ కార్పొరేటర్‌ కుమారుడు మురాద్‌పై కత్తితో దాడి చేశారు. కోటిరెడ్డి కాలేజీ వద్ద అభ్యర్థి త్యాగరాజుపై దాడి చేసి నామినేషన్‌ పత్రాలను చించివేశారు. కమలాపురం ఇన్‌చార్జి నరేన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. కడపలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్యాంసన్‌పై పచ్చ మూకలు దాడి చేయడంతో ఆయన కోమాలోకి వెళ్లాడు. బద్వేలు టీడీపీ ఇన్‌చార్జి సూర్యనారాయణరెడ్డి తన అనుచరవర్గంతో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నామినేషన్‌ కౌంటర్‌లోకి ప్రవేశించి పోలీసులు, అధికారుల ఎదుటే ఇద్దరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడి చేశాడు. 

దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలన్నింటినీ ఎత్తుకెళ్లిపోయాడు. 14వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్‌మాబుచాన్‌ చేతిలోని నామినేషన్‌ పత్రాలను లాక్కున్నాడు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను బూతులు తిడితూ మూడు పర్యాయాలు దాడికి పాల్పడ్డాడు. మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సాక్షిగా పచ్చ మూక దౌర్జన్యకాండకు దిగింది. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 17 మంది చేతుల్లోని నామినేషన్‌ పత్రాలను దౌర్జన్యంగా లాక్కొని చించివేశారు. 

‘ఏయ్‌ ఎవర్రా నామినేషన్‌ వేసేది.. లాక్కోండి రా.. చించండి రా.. అంటూ మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ సభ్యుడు పొలిమేర అమర్‌నాథ్‌రెడ్డి రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపోతుల కిరణ్మయి తదితరుల చేతుల్లో ఉన్న నామినేషన్‌ పత్రాలను చింపేసి గాల్లోకి విసిరేశారు. 22వ వార్డుకు నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరిడి నాగాంజలి దేవి, ఆమె భర్త రమణమూర్తిపై దౌర్జన్యానికి దిగారు.   అధికారుల వద్ద ఉన్న నామినేషన్‌ పత్రాలను సైతం లాక్కొని వెళ్లారు. 

                            పులివెందులలో కాల్పులు జరుపుతున్న పోలీసులు  

మహిళలను తిట్టి.. గోళ్లతో రక్కి..
కమలాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పచ్చగూండాలు అడ్డుకున్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మారుజోళ్ల కవిత నామినేషన్‌ వేసేందుకు మరో నలుగురు మహిళలతో కలసి కేంద్రానికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న పచ్చ రౌడీలు మహిళలను మధ్యలోనే ఆపేసి వారి వద్ద ఉన్న నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించివేశారు. బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించారు.

రౌడీమూక వారిపై దాడి చేసి గోళ్లతో రక్కడంతో లక్ష్మి అనే మహిళకు గొంతు కింద రక్త గాయాలయ్యాయి.  నామినేషన్‌ కేంద్రానికి వెళ్లకుండా వెనక్కి పంపించివేశారు. ఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్‌ కరుమూరి జయచంద్రపై భౌతిక దాడికి పాల్పడ్డారు. సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఇంత జరిగితే పోలీసులు మాత్రం వైఎస్సార్‌సీపీ నేతలు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

రాయచోటిలో రెండో రోజూ కొనసాగిన దౌర్జన్యకాండ
రాయచోటిలో పచ్చ గూండాల హింసాకాండ శనివారం కూడా కొనసాగింది. నామినేషన్‌ కార్యక్రమానికి సిద్ధమవుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జిన్నా మహమ్మద్‌ షరీఫ్‌పై ఎల్లో రౌడీలు దాడికి తెగబడ్డారు. రాయచోటి పట్టణం, మదనపల్లి మార్గంలోని ఓ ప్రైవేటు హోటల్‌ నుంచి నామినేషన్‌ కార్యక్రమానికి సిద్దమవుతున్న వేళ ఆ హోటల్‌ను చుట్టుముట్టారు. ప్రాంగణంలో ఉన్న జిన్నా షరీఫ్‌ కారును ధ్వంసం చేశారు. కాగా, రామాపురం, లక్కిరెడ్డిపల్లి మార్గాల ద్వారా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని రాయచోటిలోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. చుట్టూ ఉన్న రహదారులపై వందలాది మంది రౌడీలు కట్టెలు, రాడ్లు పట్టుకొని స్వైర విహారం చేశారు.

ఎమ్మెల్యే ఆకేపాటి ఇంటి కిటికీ అద్దాలు, కుర్చీలు ధ్వంసం
రాజంపేటలో వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్ల వర్షం కురిపించి మారణాయుధాలతో హత్యాయత్నాలకు తెగబడ్డారు. నామినేషన్‌ వేసి బయటకు వచ్చే సమయంలో పచ్చ గూండాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకొని వారికి అధికారులు ఇచ్చిన రిసిప్ట్, చెక్‌లిస్ట్‌ పేపర్‌లను చించేశారు. నూనెవారిపల్లె రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం(ఆకేపాటి భవన్‌) నుంచి పార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు వస్తున్నారని తెలుసుకున్న రౌడీలు ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఇంటిపైకి దాడి చేసేందుకు మూకుమ్మడిగా బయలు దేరారు. పథకం ప్రకారం ఆకేపాటి భవన్‌పై దాడికి తెగబడ్డారు. కిటికీ అద్దాలు, కుర్చీలను ధ్వంసం చేశారు. ఇంటి బయట ఉన్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సోదరుడు ఆకేపాటి అనీల్‌కుమార్‌రెడ్డికి చెందిన కారు ధ్వంసం చేశారు. 

పచ్చమూక అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ నేత గుండు మల్లికార్జునరెడ్డి, పార్టీ ఛైర్మన్‌ అభ్యర్థి రేష్మ తాత కాలేషాతో పాటు మరికొంత మందిపై మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడింది. దీంతో మల్లికార్జునరెడ్డి, కాలేషా, ముస్తాఫాల తలలపై బలమైన గాయాలయ్యాయి. వైఎస్సార్‌సీపీ తరఫున మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థి నడిగడ్డ రేష్మా నామినేషన్‌ వేసి బయటకు వెళుతున్నప్పుడు టీడీపీ మూకలు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి దాడికి యత్నించారు. దీంతో పక్కనే ఉన్న రేష్మా తండ్రి నడిగడ్డ ఇమాములు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతనిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. రాజంపేట 9వ వార్డు అభ్యర్థి ఎస్‌ఎం నయాజ్, ఆయన సతీమణి షాజిదా వద్ద ఉన్న నామినేషన్‌ పత్రాలను పచ్చపార్టీ నేత సుహైల్‌ఖాన్‌ వర్గీయులు లాక్కెళ్లారు. దీంతో నయాజ్, ఆయన సతీమణి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

దౌర్జన్యం చేసిన వారిని వదిలి.. భూమనపై కేసు
తిరుపతిలో ప్రజా ప్రతినిధులపైన సైతం దౌర్జన్యపర్వం కొనసాగింది. తిరుపతి కార్పొరేషన్‌ వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌ నామినేషన్‌ వేస్తున్న తరుణంలో తోడుగా వెళ్లిన ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంలను పచ్చ మూకలు, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ఎల్లో గ్యాంగ్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు చించివేశారు. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డిలపై ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

దుస్తులు చించి.. బూతులు తిట్టి..
తిరుపతిలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మవిత, పావనీలను పచ్చ గ్యాంగ్‌ అడ్డుకుని దుస్తులు చించి.. జుట్టు పట్టు­కుని కొట్డడంతో ఆ మహిళలు కన్నీరుమున్నీరుగా విలపించా­రు. 12, 15 వార్డుల నామినేషన్‌ కేంద్రాల వద్ద ఆ మహిళా అభ్యర్థులపై విచక్షణా రహితంగా దాడి చేసినా పోలీసులు చూసీ చూడనట్టే వ్యవహరించారు. 36వ వార్డు అభ్యర్థి ఇమామ్‌పై కూడా పచ్చ బ్యా­చ్‌ దాడి చేసింది. 7వ డివిజన్‌ అభ్యర్థి మల్లం రవిపై దాడి చేసిన టీడీ­పీ మూ­కలను వదిలేసి, బాధితుడినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దర్శిలో దాడులకు తెగబడ్డ పచ్చమూక 
ప్రకాశం జిల్లా దర్శిలో నామినేషన్లు వేస్తున్న వారిపై దాడులకు తెగబడి పత్రాలను లాక్కుని చించివేశారు. ఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరి కొణతం సురేష్‌పై కడియాల రమేష్, కర్ణా శ్రీను, మరో 30 మంది దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా కత్తులతో రణరంగం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని గడియారం స్తంభం సెంటర్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో పాటు వెళ్తున్న వారిని కూడా పచ్చగూండాలు అడ్డుకుని దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత వెంకటరెడ్డిపై దాడి చేస్తుండగా, కాపాడేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ  నేతలపై ఖాకీలు లాఠీలు ఝుళిపించారు.

             దర్శిలో పోలీసుల ఎదుటే నామినేషన్‌ పత్రాలు చించివేస్తున్న టీడీపీ నేతలు 

తాడిపత్రి రూరల్‌ సీఐ ఓవరాక్షన్‌
అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్‌ సీఐ నారాయణరెడ్డి ఓవరాక్షన్‌ చేశారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శి కేశవరెడ్డిని, పార్టీ సీనియర్‌ నేత పేరం అమర్‌నాథరెడ్డిని బలవంతంగా వెనక్కు పంపించారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న సీఐ నారాయణరెడ్డి, తాడిపత్రి పోలీసులు వైఎస్సార్‌సీపీకి చెందిన నామినేషన్లు అడ్డుకునేందుకు సహకరించారు. 

అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నేత కేశవరెడ్డిని నామినేషన్‌ వేయనీకుండా వెనక్కు పంపుతున్న పోలీసులు 

కర్నూలు జిల్లా నంద్యాలలో విజయ డెయిరీ చైర్మన్‌ ఎస్వీ జగన్మోహన్‌రెడ్డిని ఆళ్లగడ్డలోని బంధువు అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ వేయకుండా బెదిరింపులకు పాల్ప­డ్డారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులపై అక్రమ కేసులు బనాయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement