కూటమి ప్రభుత్వ అరాచకాలపై నేడు వైఎస్‌ జగన్ ప్రెస్‌మీట్ | Local Body Polls Violence: YS Jagan to Address Media Today, Meet Governor to Submit Report | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వ అరాచకాలపై నేడు వైఎస్‌ జగన్ ప్రెస్‌మీట్

Oct 17 2026 11:59 PM | Updated on Oct 18 2026 12:03 AM

Local Body Polls Violence: YS Jagan to Address Media Today, Meet Governor to Submit Report

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రెస్‌మీట్‌ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, అధికార పార్టీ దౌర్జన్యాలను ఆయన ప్రజల ముందుంచనున్నారు.

అదేవిధంగా, ఆదివారం సాయంత్రం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో వైయస్ జగన్ భేటీ కానున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న దారుణాలను ఆయన రాష్ట్ర గవర్నర్‌కు వివరించి ఫిర్యాదు చేయనున్నారు.

పచ్చమూకల హింసాకాండ..
కాగా స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో పచ్చమూకలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర హింసాకాండ సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం పార్టీ లోక్‌సభ పక్షనేత పీవీ మిధున్‌రెడ్డిపై పుంగనూరులో టీడీపీ శ్రేణులు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. అలాగే, శనివారం పులివెందులలోనూ టీడీపీ గుండాలు పెట్రేగిపోయి దాడులకు తెగబడ్డారు. ఈ అప్రజాస్వామిక ఘటనలపై నేటి మీడియా సమావేశంలో వైయస్ జగన్ విస్త్రృతంగా మాట్లాడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement