జీవీఎంసీ రెండో జాబితా విడుదల.. కూటమి అరాచకాలపై బొత్స ఫైర్‌ | Botsa Satyanarayana Releases GVMC Second List | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ రెండో జాబితా విడుదల.. కూటమి అరాచకాలపై బొత్స ఫైర్‌

Oct 17 2026 9:19 PM | Updated on Oct 17 2026 9:20 PM

Botsa Satyanarayana Releases GVMC Second List

సాక్షి,విశాఖ‌: స్థానిక సంస్థ‌ల ఎన్నికల ప్ర‌క్రియ‌లో కూట‌మి ప్ర‌భుత్వం హింసాకాండకు పాల్ప‌డుతుంటే ఎన్నికల సంఘం ప్రేక్ష‌క పాత్ర వ‌హించ‌డంపై శాసన మండలి ప్రతి పక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  శ‌నివారం 34 మంది పేర్లతో జీవీఎంసీ రెండవ జాబితాను విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా బొత్స మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో దుర్మార్గాలు దౌర్జన్యాలకు కూటమి నేతలు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై రాళ్ళు కర్రలతో కత్తులతో దాడులు చేస్తున్నారు. కూటమి నేతలు నామినేషన్లు అడ్డుకునే ప్రక్రియను రాష్ట్ర ప్రజలంతా చూశారు.

వైఎస్సార్సీపీ నేతలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడులు, దౌర్జన్యాలు ప్రజా స్వామ్యంలో మంచి పద్ధతి కాదు. పోలీసులు అధికార పార్టీ నేతలుకు వత్తాసు పలకడం మంచిది కాదు. అధికారం మదంతో కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు. ఓట‌మి  భయంతో దాడులకు పాల్పడుతున్నారు. దాడులను ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. ఎన్నికల సంఘం నిస్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్  చేశారు.   

ఇదీ చ‌ద‌వండి : కొలిక‌పూడి తిరుగుబాటు.. కూట‌మిలో రేగిన ముస‌లం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement