నేడు గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan to meet the Governor today | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ

Oct 18 2026 2:54 AM | Updated on Oct 18 2026 2:54 AM

YS Jagan to meet the Governor today

ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం విజయవాడలోని లోక్‌ భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండకు దిగడం, నామినేషన్లు వేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్‌ పత్రాల చించివేత తదితర దారుణాలను గవర్నర్‌కు వివరించనున్నారు.  

నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ 
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడనున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో వరుసగా రెండు రోజులు పలు చోట్ల విధ్వంసకాండ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్‌ పేపర్లు లాక్కుని చించేయడం.. చివరకు పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డిపై పుంగనూరులో హత్యాయత్నం, పులివెందులలో శనివారం పోలీసులు గాలిలోకి కాల్పులు, బాష్పవాయు ప్రయోగం.. వంటి ఘటనల నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement