వంశీకి తక్షణమే వైద్యం అందించాలి.. హైకోర్టు ఆదేశం | High Court Hearing On Vallabhaneni Vamsi Medical Bail Petition | Sakshi
Sakshi News home page

వంశీకి తక్షణమే వైద్యం అందించాలి.. హైకోర్టు ఆదేశం

May 29 2025 3:31 PM | Updated on May 29 2025 4:13 PM

High Court Hearing On Vallabhaneni Vamsi Medical Bail Petition

సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. వంశీకి తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని.. వంశీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని.. ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.

వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌ను నూజివీడు కోర్టు డిస్మిస్ చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు.. వంశీని విచారిస్తున్నారు. మరోసారి కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement