మూడు రోజులు విస్తారంగా వానలు | Heavy rains for three days | Sakshi
Sakshi News home page

మూడు రోజులు విస్తారంగా వానలు

Jul 23 2023 5:43 AM | Updated on Jul 23 2023 12:24 PM

Heavy rains for three days - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం ఒడిశా–ఉత్తరాంధ్రకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది.

అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా బలపడ నుందని ఐఎండీ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా అది పయనిస్తుందని అంచనా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement