సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను విపత్తుల సంస్థ ప్రకటించింది. పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
విశాఖపట్నంలో వర్షం దంచికొడుతోంది. బీచ్ రోడ్డులో వరద నీరు భారీగా చేరింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సుమారు గంట నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.


